Breaking News

సహాయ కార్యక్రమాల్లో ప్రభుత్వానికి సహకరించిన అందరికీ కృతజ్ఞతలు

-విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర గురువారం నాడు విడుదల చేసిన ఒక ప్రకటనలో బుడమేరు వరదల నుండి విజయవాడ నగరం సత్వరంగా కోలుకుంటున్నందుకు, సహాయ కార్యక్రమాల్లో ప్రభుత్వానికి సహకరించిన అందరికీ కృతజ్ఞతలు తెలిపారు. విజయవాడ నగరంలో ఇటీవల వచ్చిన బుడమేరు వరదలను, విజయవాడ నగరపాలక సంస్థ దిగ్విజయంగా వరద ప్రభావం నుండి బయటపడింది. వచ్చిన వరద ఉధృతి ఎక్కువైనప్పటికీ, దాని ప్రభావం విపరీతంగా ఉన్నప్పటికీ, తక్కువ సమయంలో వరద ప్రభావాన్ని అధిగమించామన్నారు విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యాన చంద్ర హెచ్.యం. ఆగష్టు 31, 2024 న, విజయవాడలో అధిక వర్షపాతం నమోదైయింది. వెంటనే బుడమేరు కాలువలో వరదలు గణనీయంగా పెరిగాయి. ఈ హెచ్చరికను విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర ముందుగానే బుడమేరు పరివాహక ప్రాంతాలలో మరియు లోతట్టు ప్రాంతాలలో( రామలింగేశ్వర నగర్ ) ఉన్న ప్రజలకు రెడ్ అలర్ట్ జారీ చేశారు. బుడమేరు ప్రవాహాన్ని ఎప్పటికప్పుడు అప్రమత్తంగా పరిశీలిస్తూ, బుడమేరు పరివాహక ప్రాంతాలు మరియు లోతట్టు ప్రాంతాల్లో ఉన్న ప్రజలను వెంటనే పునరావస కేంద్రాలకు విజయవాడ నగరపాలక సంస్థ వారు తరలించారు.

60,000 క్యూసెక్కులతో బుడమేరు నీరు విజయవాడ నగరాన్ని జలమయం చేసింది. సర్కిల్ వన్ పరిధిలోని హెచ్ బి కాలనీ, లేబర్ కాలనీ, క్రాంబే రోడ్, హరిజనవాడ, నిజాంపేట్, జండా చెట్టు, వించిపేట, కొత్తపేట, జోజీ నగర్, ఊర్మిళా నగర్, పాత రాజేశ్వరి పేట, మిల్క్ ఫ్యాక్టరీ, కంసాలిపేట, సర్కిల్ 2 పరిధిలోని ఇందిరానగర్ కాలనీ, నందమూరి నగర్, రామకృష్ణాపురం, వుడా కాలనీ, కొత్త రాజరాజేశ్వరి పేట, ఆంధ్రప్రభ కాలనీ, మద్యకట్ట, ఎంబిఎస్ నగర్, లూనా సెంటర్, అజిత్ సింగ్ నగర్, నందమూరి నగర్, సుబ్బరాజు నగర్, దేవీనగర్, పటేల్ నగర్, గుణదల ప్రాంతాలలోబుడమేరు వరద ప్రభావం చూపించగా, సర్కిల్ 3 పరిధిలోని సాయిరాం కట్ పీసెస్ రోడ్, భూపేష్ గుప్తా నగర్, తారకరామ నగర్, రాణి గారి తోట, రణదీవ్ నగర్, రామలింగేశ్వర నగర్, దోబికాన ఆపోజిట్ ఆర్టీసీ బస్ డిపో కృష్ణలంక, ప్రాంతాలలో మరోవైపు కృష్ణ నది ప్రవాహం పెరుగుతూ వచ్చి సర్కిల్ 3 పరిధిలో ఉన్న ఈ ప్రాంతాలలో వరద నీరు చేరుకుంది.  దీనితో విజయవాడ నగరపాలక సంస్థకు ఎన్నో సవాళ్లు ఎదురయ్యాయి, దాదాపు 60% కి పైగా కార్మికులు వరద ప్రభావిత ప్రాంతాలలో ఉండిపోవుటము, విజయవాడ సగం నగరం దాదాపు వరదల్లో ఉండటం, 64 వార్డులలో 32 వార్డులు వరద ప్రభావిత ప్రాంతాలయ్యాయని తెలిపారు నగర కమిషనర్ ధ్యానచంద్ర. వరద ప్రభావానికి విజయవాడ నగరపాలక సంస్థలో ఉన్న ఐదు డ్రైనేజీ పంపింగ్ స్టేషన్లు, కేఎల్ రావు హెడ్ వాటర్ వర్క్స్ ( విజయవాడ నగరంలో త్రాగునీటి సరఫరా చేసే ప్రధాన హెడ్ వాటర్ వర్క్స్ ) వరద ప్రభావానికి పాడిపోయాయని అన్నారు.

వెంటనే సిబ్బంది అప్రమత్తంగా ఉండటం వలన పాడైపోయిన డ్రైనేజీ పంపింగ్ స్టేషన్లు మరియు కేఎల్ రావు హెడ్ వాటర్ వర్క్ లో ఉన్న ట్రీట్మెంట్ ప్లాంట్లను 24 గంటల్లో పునరుద్ధరించరని తెలిపారు. విజయవాడ నగరపాలక సంస్థలో కంట్రోల్ రూమ్ను ఏర్పాటు చేయటంతో పాటు 24 గంటలు ప్రజలకు అందుబాటులో ఉండేటట్టు వారి సమస్యలను పరిష్కరించేందుకు, ఫిర్యాదులకు హెల్ప్ లైన్ నెంబర్లు పెట్టడమే కాకుండా సామాజిక మాధ్యమం ద్వారా కూడా ప్రజల సమస్యలను తెలుసుకుని పరిష్కరించమని అన్నారు. వరద ప్రభావితం ప్రాంతాల్లో ఉన్నవారికి ఆహారాన్ని ప్రత్యేకంగా బిఎంసి వారు 50 ట్రాక్టర్లతో ఆహారాన్ని అందించారని తెలిపారు. 230 ట్యాంకర్లతో త్రాగునీటి సరఫరాను నిత్యం వరద ప్రభావిత ప్రాంతాల్లో ఉన్న ప్రజలకు అందించారని అన్నారు కమిషనర్ ధ్యానచంద్ర.

ట్రాక్టర్లు వెళ్లలేని చోట ట్రాక్టర్లు ఎక్కడైతే వెళ్తాయో అక్కడ వరకు ట్రాక్టర్లతో ఆహారాన్ని తీసుకువెళ్లి అక్కడ నుండి విజయవాడ నగరపాలక సంస్థ వారి ప్రత్యేక 11 మత్స శాఖ బోట్లలో ఆహారాన్ని తీసుకువెళ్లి అవసరమైన ప్రతి ఒక్కరికి అందేలా చూసామని అన్నారు, కొన్ని ప్రదేశాలలో బోట్లు కూడా వెళ్లలేని పరిస్థితి ఉన్నప్పుడు ప్రజలకు బోట్లపైన డ్రోన్లను పెడుతూ డ్రోన్ల సహాయంతో ప్రజలకు ఆహారాన్ని అందించే విధంగా చర్యలు తీసుకున్నట్లు తెలిపారు, దాదాపు ఆరు డ్రోన్లతో ప్రతి ఒక్కరికి ఆహారం చేరేటట్టు చూసుకున్నారు అంతే కాకుండా, శివారు ప్రాంతాలలో గౌరవనీయులైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు హెలికాప్టర్ ద్వారా ఆహారాన్ని అందించే విధంగా చర్యలు తీసుకున్నట్టు తెలిపారు.

ప్రజలనే కాకుండా మూగజీవులను కూడా కాపాడుకునేందుకు చర్యలు తీసుకున్నారు విజయవాడ నగరపాలక సంస్థ అని అన్నారు కమిషనర్ ధ్యానచంద్ర. ప్రజలు అనారోగ్య బారిన పడకుండా ఉండేందుకు, దోమలను నియంత్రణకు డ్రోన్ల సహాయంతో ఎం ఎల్ ఆయిల్స్ స్ప్రే , ఫాగింగ్ చేస్తూ, ఆంటీ లార్బో ఆపరేషన్స్ తీసుకున్నట్లు తెలిపారు కమిషనర్ ధ్యానచంద్ర. 352 ఆయిల్ ఇంజన్స్ తో నిలువ ఉన్న వరద నీరును అధికారులు ఎప్పటికప్పుడు తీసివేయటమే కాకుండా 462 వాహనాలతో వరదల వల్ల పేరుకుపోయిన వ్యర్థాలను ఎప్పటికప్పుడు తొలగిస్తూ, చౌకింగ్ పాయింట్లో డీసిల్టింగ్ చేసుకుంటూ, వరదనీటి ప్రవాహానికి ఎటువంటి ఆటకం లేకుండా చర్యలు తీసుకున్నారన్నారు విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు గౌరవనీయులైన నారా చంద్రబాబునాయుడు గారి ఆదేశాల మేరకు మున్సిపల్ మినిస్టర్ పొంగూరు నారాయణ గారి సహకారంతో రాష్ట్రంలో ఉన్న ఇతర పురపాలక సంస్థల సహకారంతో 8973 ఉద్యోగస్తులు మరియు కార్మికులతో విజయవాడ నగర పాలక సంస్థ దిగ్విజయంగా పారిశుధ్య నిర్వహణ పూర్తి చేసుకుంటుందని అన్నారు. 110 ఫైర్ ఇంజన్ల ద్వారా కేవలం విధులు మాత్రమే కాకుండా వరద ప్రభావితమైన ప్రజల ఇళ్లను కూడా కడిగేటట్లుగా పారిశుధ్య నిర్వహణకు చర్యలు తీసుకుంటున్నామని అన్నారు విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర. విజయవాడకు ఇంతటి ప్రభావాన్ని చూపించిన బుడమేరు వరదలకు అంతకుమించి ఉద్యోగస్తుల, కార్మికుల ప్రతిభను చూపించి, వరద ప్రభావం నుండి సత్వరంగా కోలుకుంది అని అన్నారు. ప్రత్యేకించి వరద సమయంలో విజయవాడ నగరపాలక సంస్థకు సహకరించిన ప్రజలందరికీ కృతజ్ఞతలు తెలిపారు విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర.

Check Also

మద్దిరాలపాడు పర్యటనలో…

ఒంగోలు, నేటి పత్రిక ప్రజావార్త : మద్దిరాలపాడు పర్యటనలో భాగంగా తాళ్లూరి జగ్గయ్య (67), పార్వతి దంపతుల ఇంటికి ముఖ్యమంత్రి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *