Breaking News

స్వచ్ఛతాహి సేవ కార్యక్రమం నిర్వహించుటకు అన్ని చర్యలు

మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త :
జిల్లాలో ఈనెల 17 నుండి అక్టోబర్ 2 వరకు స్వచ్ఛతాహి సేవ కార్యక్రమం నిర్వహించుటకు అన్ని చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ అధికారులకు సూచించారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్ అమరావతి సచివాలయం నుండి జిల్లా కలెక్టర్లతో గురువారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి రాష్ట్రంలో సంభవించిన వరదలు, స్వచ్ఛతాహి సేవ కార్యక్రమం నిర్వహణ తదితర అంశాలపై సమీక్షించారు. జిల్లా కలెక్టర్, జాయింట్ కలెక్టర్ గీతాంజలి శర్మ కలెక్టరేట్ నుండి సిఎస్ వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొన్నారు. జిల్లాలో కృష్ణానది, బుడమేరు వరదలు కారణంగా ముంపునకు గురైన ప్రాంతాలు ఇప్పుడిప్పుడే తేరుకుంటున్నాయని, తాగునీరు కలుషితమై సీజనల్ వ్యాధులు వ్యాపించే అవకాశం ఉందని, కావున గ్రామాల్లో పట్టణాల్లో పారిశుధ్యం పై దృష్టి కేంద్రీకరించాలన్నారు.

రాష్ట్ర ప్రభుత్వం ఈనెల 17వ తేదీ నుంచి అక్టోబర్ 2 వరకు రాష్ట్రవ్యాప్తంగా స్వచ్ఛతాహి సేవ కార్యక్రమం నిర్వహించాలని ఆదేశాలు జారీ చేసిందన్నారు. ఇందుకు అనుగుణంగా జిల్లాలో ఈ కార్యక్రమం నిర్వహించుటకు జిల్లాస్థాయి స్క్రీనింగ్ కమిటీ ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలన్నారు. స్వభావ్ స్వచ్ఛత-సంస్కార్ స్వచ్ఛత ముఖ్యాంశంగా ఈ కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఎక్కువగా చెత్త పోగయ్యే బ్లాక్ స్పాట్స్ గుర్తించాలని, పరిశుభ్రత కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. తద్వారా ఆరోగ్యకరమైన పరిశుభ్రమైన వాతావరణం కల్పించాలన్నారు.

పబ్లిక్ ప్రదేశాలు, ఆఫీసులు, విద్యాసంస్థలు, బస్టాండ్లు రైల్వేస్టేషన్ల వంటి ప్రజా రవాణా హబ్స్, టూరిజం ప్రదేశాలు వంటి చోట్ల సామూహిక స్వచ్ఛత కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. స్వయ స్వయం సహాయక సంఘాలను భాగస్వామ్యం చేయాలని అన్నారు. నిర్వహించిన కార్యక్రమాలు వివరాలు స్వచ్ఛతాహి సేవ పోర్టల్ లో అప్లోడ్ చేయాలన్నారు. అక్టోబర్ 2న మహాత్మా గాంధీ జయంతి పరిష్కరించుకొని స్వచ్ఛభారత్ దివస్ కార్యక్రమాలు జిల్లా వ్యాప్తంగా నిర్వహించాలన్నారు. ఇందులో భాగంగా ప్రత్యేక గ్రామసభలు నిర్వహించాలని, సఫాయి మిత్రలను సత్కరించాలన్నారు. జిల్లా పంచాయతీ అధికారి నాగేశ్వర నాయక్, జిల్లా పరిషత్ సీఈఓ ఆనంద్ కుమార్, జిల్లా ఆర్డబ్ల్యూఎస్ అధికారి శివప్రసాద్, సివిల్ సప్లై డి ఎం తోట సతీష్ వీడియో కాన్ఫరెన్స్లో పాల్గొన్నారు.

Check Also

మద్దిరాలపాడు పర్యటనలో…

ఒంగోలు, నేటి పత్రిక ప్రజావార్త : మద్దిరాలపాడు పర్యటనలో భాగంగా తాళ్లూరి జగ్గయ్య (67), పార్వతి దంపతుల ఇంటికి ముఖ్యమంత్రి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *