Breaking News

మెప్మా డిజిటల్ ఛాంపియన్

అమ‌రావ‌తి, నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల ప్రకారం పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ మెప్మా ద్వారా పట్టణాలలోని అన్ని కుటుంబాలను డిజిటల్ సాధికారత సాధించేలా చేయుటకు ప్రతి 100 కుటుంబాలకు ఒక డిజిటల్ ఛాంపియన్ ను ఏర్పాటు చేయడమైనది. ఈ కార్యక్రమంకు “డిజి-లక్ష్మి/ఐశ్వర్య లక్ష్మి” గా నామకరణం చేయడమైనది. “డిజిటల్ ఛాంపియన్” అనేది పూర్తి స్థాయిలో స్వచ్చందంగా నిర్వహించే సేవ, ఇది ఉద్యోగం కాదు. ప్రజలకు సేవ చేయాలనుకునే ఆసక్తి/ఉత్సుకత కలిగిన వారిని మాత్రమే డిజిటల్ ఛాంపియన్లుగా ఎంపికచేయబడతారు. ఇది నిర్దిష్ట కాలపరిమితి కలిగిన కార్యక్రమము.

దీనిలో భాగంగా మొట్టమొదటిగా విజయవాడలో 4,000 మందిని డిజిటల్ ఛాంపియన్ లను గుర్తించడం జరిగింది. మొదటి విడతలో చురుకైన మరియు సాంకేతిక నైపుణ్యం కలిగిన మహిళలలు 2000 మందికి గౌరవ మెప్మా మిషన్ డైరెక్టర్ ఎన్ తేజ్ భరత్ ఐఏఎస్ డిజిటల్ ఛాంపియన్స్ కి APSIRDPR వారి సహకారంతో కానూరు, విజయవాడ ఆఫీస్ లో ఈరోజు 13.09.2024 వర్చ్యువల్ గా శిక్షణ ఇవ్వడం జరిగింది.

ప్రతి 100 కుటుంబాలకి ఒక క్లస్టర్ గా విభజించి ఒక్కొక్క క్లస్టర్ నకు ఒక్కొక్క డిజిటల్ ఛాంపియన్ లను నియమించ డం జరిగింది. ఈ డిజిటల్ ఛాంపియన్ యొక్క ముఖ్య ఉద్దేశం ఆ క్లస్టర్లో 100 కుటుంబాలకి ప్రతినిధిగా ఉండి ప్రజల అనుమతితో వారి మొబైల్ లో ఈ యాప్ ఇన్స్టాల్ చేసి, లాగిన్ ఎలా చేయించాలి, తర్వాత రిపేరు వున్న చోట, రిక్వెస్ట్ ఎలా బుక్ చేయాలి ఎలా సబ్మిట్ చేయాలి అనేది డిజిటల్ ఛాంపియన్స్ చేయవలసిన ముఖ్యమైన పని అని ఎండి గారు సూచించారు.

డిజి-లక్ష్మి/ఐశ్వర్య లక్ష్మి కార్యక్రమ ఉద్దేశ్యం:
-ప్రతి కుటుంబం సైబర్ నేరాల బారిన పడకుండా డిజిటల్ లావాదేవీలు నిర్వహించేలా అవగాహన కల్పించుట
-కుటుంబానికి అవసరమైన అన్ని అవసరాలను అందుబాటులో ఉన్న గుర్తింపు పొందిన వివిధ రకాల యాప్ ల ద్వారా
నిర్వహించుకునేలా శిక్షణలు ఇవ్వుట
-వ్యక్తిగత బ్యాంకు లావాదేవీలను డిజిటల్ పద్ధతిలో చేసేలా అవగాహన కల్పించుట ఈ కార్యక్రమ ఉద్దేశ్యం.

Check Also

మద్దిరాలపాడు పర్యటనలో…

ఒంగోలు, నేటి పత్రిక ప్రజావార్త : మద్దిరాలపాడు పర్యటనలో భాగంగా తాళ్లూరి జగ్గయ్య (67), పార్వతి దంపతుల ఇంటికి ముఖ్యమంత్రి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *