Breaking News

మొదటిసారి కృష్ణా జలాలతో నిండిన గండికోట జలాశయం

-ప్రభుత్వ సూచన ప్రకారం కెనాల్ లో పూడికలు , రిజర్వాయర్ డ్యాం గేట్ పనులు పూర్తి చేయడంతో ..
కడప,అన్నమయ్య జిల్లాల్లో మూడు లక్షల ఎకరాలకు సాగునీరు
-నిండుకుండలా మారనున్న 150 చెరువులు
-ప్రతి రైతుకు చివరి ఆయకట్టు వరకు నీరు అందిస్తాము… మంత్రిమండిపల్లి రాంప్రసాద్ రెడ్డి

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ఈ సంవత్సరం రాయలసీమలో వర్షపాతం తక్కువ ఉన్నప్పటికీని ఎగువ కృష్ణ పరివాహక ప్రాంతం నుండి భారీ గా శ్రీశైలం రిజర్వాయర్ నుండి ప్రవాహం వచ్చినందున వల్లనా 200 కిలోమీటర్ల దూరంలో ఉన్న గండికోట రిజర్వాయర్ కు వరద నీటిని తీసుకువచ్చి 25.5 టీఎంసీలతో నింపడం జరిగిందని రాష్ట్ర రవాణా యువజన క్రీడా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి ప్రత్రికా ప్రకటనలో తెలిపారు.

మంత్రి మాట్లాడుతూ… జలాశయం నిర్మాణం పూర్తయిన తర్వాత పూర్తి సామర్థ్యం (26.8) గాక 25.5 టిఎంసి మేర నీటిని నిల్వ చేయడం ఇదే తొలిసారి కావడం గమనార్హం మాని, 2012లో పూర్తి చేసుకున్న గండికోట జలాశయం 2013 -14 లో కేవలం 3 టీఎంసీల నీటితో నిండాగ నాటినుండి నేటి వరకు పెన్నా క్యాచ్ మెంట్ తో వచ్చిన 80 శాతం నీటి ద్వారానే గండికోట దానికి అనుబంధం గా ఉన్న రిజర్వాయర్లు అయినటువంటి మైలవరపు చిత్రావతి, పైడిపాలెం, సర్వ సాగర్, వావికొండ జలాశయాలను నింపడం జరుగుతుందని, మిగిలిన 20 శాతం కృష్ణ జలాలతో నింపుతున్నామని తెలిపారు.

ప్రభుత్వం ఇచ్చిన సూచనలతో ద్వారా నిత్యం అధికారులు పర్యవేక్షిస్తున్నందున మొదటిసారి కృష్ణా జలాలు గండికోట రిజర్వాయర్లు నింపడం జరిగిందని, అంతేకాకుండా కడప జిల్లా కు 40 టిఎంసిలు శ్రీశైలం జలాశయం వరద నీటిని తీసుకోవడం ద్వారా కడప జిల్లాలో ఉన్నటువంటి జిఎన్ ఎస్ఎస్, తెలుగు గంగా ప్రాజెక్టు సంబంధించిన 9 రిజెర్వేయర్లను అక్టోబర్ 30 నాటికి కృష్ణా జలాలతో పూర్తిగా నింపడం జరుగుతుందని తెలిపారు.

అన్ని రిజర్వాయర్లు కెపాసిటీ 72 టీఎంసీలు ఉందని ఇంత పెద్ద ఎత్తున కృష్ణా జలాల నీటిని మళ్లించి, నీటి నింపడం కూడా ఇదే మొదటి సారి అని వెల్లడించారు.

అదే విధంగా ప్రభుత్వ సూచన ప్రకారం కెనాల్ లో ఉన్న పూడిక పనులు , గేట్ పనులు పూర్తి చేయడం జరిగిందని తద్వారా ఈ ఖరీఫ్ సీజన్ నందు ఉమ్మడి కడప,అన్నమయ్య జిల్లాల్లో మూడు లక్షల ఎకరాలకు సాగునీటిని అందిస్తూ ఖరీఫ్ రైతుల సాగు చేసేందుకు వీలు కల్పించడం జరిగిందని పేర్కొన్నారు..
అంతేకాకుండా కడప జిల్లాలో ఉన్న 150 చెరువులను కూడా నీటితో నింపడం జరిగిందని తెలిపారు. ప్రతి రైతుకు చివరి ఆయకట్టు వరకు నీరు అందించడం జరుగుతుందని మంత్రి తెలిపారు.

Check Also

మద్దిరాలపాడు పర్యటనలో…

ఒంగోలు, నేటి పత్రిక ప్రజావార్త : మద్దిరాలపాడు పర్యటనలో భాగంగా తాళ్లూరి జగ్గయ్య (67), పార్వతి దంపతుల ఇంటికి ముఖ్యమంత్రి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *