Breaking News

ఎస్పీతో కలిసి బ్లాక్ స్పాట్ లని తనిఖీ చేసిన కలెక్టరు ప్రశాంతి

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
శనివారం రాత్రి స్థానిక పొట్టిలంక , కడియపులంక బుర్రిలంక, వేమగిరి తదితర ప్రాంతాల్లో ప్రమాదాలు జరిగే ప్రాంతాలను క్షేత్ర స్థాయిలో పరిశీలించడం జరిగిందని జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి తెలిపారు. జిల్లా పరిధిలో ప్రమాద కూడలను గుర్తించి అక్కడ చేపట్టవలసిన రక్షణ భద్రత చర్యలపై జాతీయ రహదారుల అధికారులకు సూచనలను చేయడం జరిగిందన్నారు. ప్రమాదాలు జరిగే ప్రాంతాల్లో సూచికలను ఏర్పాటు చేసి వాహనదారులను అప్రమత్తం చేయాలన్నారు. అదేవిధంగా ప్రమాదా లకు కారణమైన రహదారుల మరమ్మతులను అత్యంత ప్రాధాన్యత ఇవ్వడం ద్వారా పూర్తి చేయాలని ఆదేశించారు. జాతీయ రహదారి మార్గాల్లో ప్రమాదాలను నివారించేందుకు నిర్దిష్టమైన ప్రాంతాల్లో వాహనాలను పార్కింగ్ చేసేలాగా అవగాహన కల్పించాల్సి ఉందన్నారు. ప్రమాదాలు జరిగే ప్రాంతాలను గుర్తించి అక్కడ ప్రత్యేక సూచిక బోర్డులను ఏర్పాటు చేయడంతో పాటు పెట్రోలింగ్ వ్యవస్థను మరింత సమర్థవంతంగా నిర్వహించాల్సి ఉందని స్పష్టం చేశారు. కలెక్టర్ వెంట ఎస్పీ డి నరసింహా కిషోర్, జాతీయ రహదారి ప్రాజెక్ట్ డైరెక్టర్ సురేంద్ర, ట్రాఫిక్ డిఎస్పీ ఎమ్. వెంకటేశ్వర్లు , సౌత్ జోన్ డిఎస్పీ భవ్య కిషోర్, ఇతర సమన్వయ శాఖల అధికారులు ఉన్నారు.

Check Also

మద్దిరాలపాడు పర్యటనలో…

ఒంగోలు, నేటి పత్రిక ప్రజావార్త : మద్దిరాలపాడు పర్యటనలో భాగంగా తాళ్లూరి జగ్గయ్య (67), పార్వతి దంపతుల ఇంటికి ముఖ్యమంత్రి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *