అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
వినాయక చవితి వేడుకల్లో ముఖ్యమైన ఘట్టం నేడు టీడీపీ కేంద్రకార్యాలయం వద్ద ఏర్పాటు చేసిన గణేష్ మండపంలో చోటుచేసుకుంది. వినాయకుడి చల్లని చూపులు పడి.. ఆయన కరచరములలో ఉండి ఎంతో మహిమాన్వితమైన లడ్డూను పొందేందుకు.. టీడీపీ నాయకులు, కార్యాలయ సిబ్బంది పోటీ పడ్డారు. నిర్వహించిన వేలం పాటలో పోటాపోటీగా వేలం పాడుతూ.. విఘ్నేశ్వరుడి లడ్డూను కైవసం చేసుకోవాలని తీవ్రంగా యత్నించారు. రసవత్తరంగా సాగిన వేలంపాటలో కేంద్రకార్యాలయంలో పనిచేస్తోన్న ప్రోగ్రాం కమిటీ రూ. 27,000లకు లంబోధరుడి లడ్డూని కైవసం చేసుకుంది. ఈ కార్యక్రమంలో ఏ.వీ రమణ, ధారపనేని నరేంద్ర, రాంబాబు, హర్షా, ధామోదర్, సంపత్, కార్యాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. రేపు ఆదివారం వినాయక నిమజ్జన కార్యక్రమం అట్టహాసంగా జరగనుంది కావునా అందరూ ఈ కార్యక్రమంలో పాల్గొని ఏక దంతుడి ఆశీసులు పొందాలని , నాయకులు, కార్యాలయ సిబ్బంది కోరారు.
Tags amaravathi
Check Also
కేంద్రం నుంచి హోం శాఖకు రావాల్సిన నిధుల కోసం కృషి చేస్తాను : ఎంపి కేశినేని శివనాథ్
-సచివాలయంలో హోంమంత్రి అనిత తో భేటీ -పోలీస్ శాఖలోని పలు శాఖ అధికారులతో సమీక్షా సమావేశం విజయవాడ, నేటి పత్రిక …