విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
విజయవాడకు వరద పేరిట జరుగుతున్నది తప్పుడు ప్రచారం నేపథ్యంలో జిల్లా కలెక్టర్ డా. జి. సృజన హుటాహుటిన సింగ్ నగర్ రాజరాజేశ్వరి పేటలో పర్యటించారు. మళ్ళీ బుడ మేరు వరద కేవలం పుకారు మాత్రమే నని సోషల్ మీడియా ప్రచారాలతో కంగారుకు లోను కావద్దని పజలకు విజ్ఞప్తి చేసారు. తప్పుడు ప్రచారం పై పోలీసులకు పిర్యాదు చేసి ప్రచారం చేసిన ఆకతాయుల కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. న్యూ ఆర్.ఆర్.పేట, జక్కంపూడి ఇరిగేషన్ శాఖ మున్సిపల్ ఉన్నతాధికారులతో మాట్లాడామని బుడ మేరు కట్ట మళ్ళీ తెగిందన్నది పూర్తిగా అవాస్తవం బుడమేరు ముంపు ప్రమాదం ఏమి లేదని కలెక్టర్ సృజన తెలిపారు.
Tags vijayawada
Check Also
మార్చి నాటికి మరొక 50వేల ఇళ్ల నిర్మాణాలను పూర్తి చేయటానికి లక్ష్యాలను నిర్దేశించాలి…
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తరువాత లక్ష ఇళ్ల నిర్మాణం పూర్తిచేశామని వచ్చే …