Breaking News

తిరుమల శ్రీవారిని దర్శించుకున్న దేవాదాయ శాఖామాత్యులు ఆనం రామ నారాయణరెడ్డి

తిరుమల, నేటి పత్రిక ప్రజావార్త :
ప్రజల కొరకు నిరంతరం శ్రమిస్తున్న దేశ ప్రధాని, రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రికి అండగా ఉంటూ రాష్ట్ర ప్రజలను ఆయు ఆరోగ్య అష్టైశ్వర్యాలు ప్రసాదించి సుఖశాంతులతో వర్ధిల్లేలా ఆశీర్వదించమని, ఎలాంటి ప్రకృతి విపత్తులు రాష్ట్రాన్ని ఇబ్బంది పెట్టకుండా చల్లగా ఆశీర్వదించమని తిరుమల శ్రీవారిని కోరుకున్నానని ఆం.ప్ర రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖామాత్యులు ఆనం రామ నారాయణరెడ్డి పేర్కొన్నారు.

సోమవారం ఉదయం తిరుమల శ్రీవారిని వి ఐ పీ విరామ సమయంలో దేవాదాయ శాఖ మంత్రి దర్శించుకున్నారు. ఈ సందర్భంగా శ్రీవారిని దర్శించుకున్న వీరికి రంగనాయక మండపంలో ఆలయ మర్యాదలతో అర్చకులు ఆశీర్వచనం పలికి తీర్థ ప్రసాదాలు అందజేశారు.

శ్రీవారి దర్శనానంతరం ఆలయం వెలుపల మంత్రి మీడియాతో మాట్లాడుతూ శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆశీస్సుల కొరకు తాను తన తోటి శాసనసభ్యులు చాలామంది ఈ రోజు దర్శనం చేసుకోవడం జరిగిందనీ, అనేక మంది పార్లమెంటు సభ్యులు, అలాగే మాజీ శాసన సభ్యులు చాలామంది కూడా వారు నేడు వ్యక్తిగతంగా స్వామివారిని దర్శనం చేసుకోవడం జరిగిందనీ తెలిపారు. ఈ రాష్ట్రానికి ఆ దేవ దేవుని సంపూర్ణ సహాయ సహకారాలు ముఖ్యమంత్రికి ఈ రాష్ట్ర ప్రభుత్వానికి శ్రీ వారి ఆశీస్సులు కావాలనీ, ఆ విధంగా వారిని ఆశీర్వదించమని స్వామి వారిని కోరుకోవడం జరిగిందనీ తెలిపారు. ప్రకృతి వైపరీత్యాల వల్ల ఇవాళ రాష్ట్రం ఒక భాగమంతా కూడా అతలాకుతలమై కనీసం 10 రోజులపాటు ఆహారం నిలువ నీడలేని పరిస్థితులలో ప్రజలు చాలామంది ఉండగా, ముఖ్యమంత్రి పట్టుదల, కృషి వారితోటి అనేకమంది ప్రభుత్వంలో ఉన్న ప్రజాప్రతినిధులు, అధికారులు అందరూ సమన్వయంతో పార్టీ నాయకులు అందరూ కలిసి పనిచేశారు అని, ఇవాళ మంచి వాతావరణాన్ని ఈ రాష్ట్రంలో తీసుకురావడం జరిగిందనీ అన్నారు. భగవంతుని యొక్క ఆశీస్సులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న అందరు తెలుగు వారికి, ఈ దేశంలో ఉన్న అందరు తెలుగు వారిపై, ఈ దేశ ప్రధానమంత్రి కి, అలాగే దేశంలో ఉన్నటువంటి యావత్ ప్రజలకు కూడా సుఖ సంతోషాన్ని సౌఖ్యాన్ని ప్రసాదించాలని, ప్రకృతి వైపరీత్యాల వల్ల ఏ ప్రాంతం కూడా నష్టపోకూడదని భగవంతుని ఆశీస్సులు కావాలని కోరుకున్నాననీ మంత్రి తెలిపారు. మంత్రి వెంట ఎమ్మెల్యే కామినేని శ్రీనివాస రావు తదితరులు ఉన్నారు.

Check Also

జిల్లాలోని రిజర్వాయర్ పనులను వేగవంతం చేయండి: జిల్లా కలెక్టర్ డా .ఎస్ వెంకటేశ్వర్

తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలోని దీర్ఘకాలంగా పూర్తికాని రిజర్వాయర్ పనులను వేగవంతం చేసేలా ప్రత్యేక దృష్టి చేపట్టాలని …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *