తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త :
k.శ్రీనివాసులు, డైరెక్టర్ అఫ్ హార్టికల్చర్ వారు సోమవారం తిరుపతి జిల్లా కాళహస్తి మండలం నందు గల ఉద్యాన నర్సరీ ని తానికి చేసి తగిన సలహాలు సూచనలు తెలియజేసారు. నాణ్యమైన మొక్కల పెంపకం చేసి రైతులకు అందుబాటులో వుంచాలని, నర్సారిని మొక్కల పెంపకం లో తగు జాగ్రతలు తీసుకోవాలని తెలియజేసారు. తదుపరి కార్యక్రమం లో భాగంగా కాళహస్తి మండలం నందు గల ఉద్యాన్ పంటల సాగుచేస్తున్న రైతుల పొలాలు క్షేత్ర సందర్శన చేసారు. తొండమనాడు గ్రామం నందు గల బతిరెడ్డి ఆయిల్ పామ్ తోటని సందర్శించి వివరాలు అడిగి తెలుసుకొన్నారు. అంతర పంట ల సాగుపై అవగాహనా కల్పించాలని తెలియజేసారు. తదుపరి అ పంట ఇ -పంట క్రింద నమోదు చేసారా అని డ్రిప్ పరికరాలు నమోదు జరిగిన వివరాలను ఉద్యాన్ అధికారిని అడిగి తెలుసుకొన్నారు. ఇ పంట వంద శాతం పూర్తి అవ్వలనీ తెలియజేసారు. రైతు అందరు పంట మార్పిడి క్రింద వారికీ బదులు ఆయిల్ పామ్ సాగు పెద్దఎత్తున చేపట్టాలని అన్ని గ్రామాలలో శిక్షణ కార్యక్రమాలు పెట్టాలని తెలియజేసారు. కనీస మద్దతు ధర కలిగిన ఉద్యాన పంట ఇది ఒక్కటే అని ,రైతులందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని తెలియజేసారు. కార్యక్రమం లో జిల్లా ఉద్యాన అధికారి బి.దాశరధ రామిరెడ్డి మరియు జిల్లా మైక్రో ఇరిగేషన్ అధికారి సతీష్ ఉద్యాన అధికారి పుష్పలత పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News