తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త :
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ, ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్, సీడ్ఆఫ్ మరియు డి ఆర్ డి ఎ సంయుక్త ఆధ్వర్యంలో తడ లోని గవర్నమెంట్ ఐటిఐ ( Govt ITI,Tada) నందు 19-09- 2024 అనగా ఈ గురువారం ఉదయం 9 గంటల నుంచి జాబ్ మేళా నిర్వహించబడును.
జాబ్ మేళా నిర్వహించే ప్రదేశం: Govt ITI, Tada, Tirupati Dist.
ఈ జాబ్ మేళాలో బహుళ జాతీయ కంపెనీలైన శ్రీ సిటీ కి సంబంధించి డైకిన్ ఎయిర్ కండిషనర్ కంపెనీ మరియు వేర్మెరియన్ రిహబ్ ప్రైవేట్ లిమిటెడ్, ఎయిర్టెల్ పేమెంట్ బ్యాంక్, అమెజాన్ వేర్హౌస్ మొదలగు కంపెనీలలో ఉద్యోగాల కొరకు ఇంటర్వ్యూలు నిర్వహించబడును. విద్యార్హతలు: పదవ తరగతి లేదా ఇంటర్మీడియట్ లేదా ఐటిఐ లేదా డిప్లమా లేదా బీటెక్ లేదా ఏదైనా డిగ్రీలో ఉత్తీర్త అయిన యువతీ యువకులు అర్హులు. ఇంటర్వ్యూలకు హాజరయ్యే యువతీ యువకులు ఆధార్ కార్డు జిరాక్స్ మరియు విద్యార్హత సంబందించిన సర్టిఫికెట్స్ జిరాక్స్ మరియు బయోడేటా ఫామ్ తో పాటు క్రింద ఇచ్చిన రిజిస్ట్రేషన్ లింక్ లో తప్పనిసరిగా నమోదు చేసుకొని కచ్చితంగా అడ్మిట్ కార్డు తో జాబ్ మేళాకు హాజరవ్వవలెను అని ఆర్ లోకనాథం, జిల్లా నైపుణ్య అభివృద్ధి సంస్థ అధికారి తిరుపతి జిల్లా మరియు దేవాదానం ప్రిన్సిపాల్, గవర్నమెంట్ ఐటిఐ కళాశాల ఒక ప్రకటనలో తెలియజేశారు.
రిజిస్ట్రేషన్ లింకు: https://Skilluniverse.apssdc.in
మరిన్ని వివరములకు 9154449677మొబైల్ నెంబర్లను సంప్రదించగలరు.
గమనిక: జాబ్ మేళాకు( ఇంటర్వ్యూలకు) హాజరయ్యా యువతి యువకులు పైన ఇచ్చిన రిజిస్ట్రేషన్ లింకులో ఆధార్ ఓటిపి తో రిజిస్ట్రేషన్ చేసుకొని మరియు మీ ప్రొఫైల్ లాగిన్ అయ్యి అన్ని కంపెనీలకు అప్లై చేసుకుని అడ్మిట్ కార్డుతో ఇంటర్వ్యూలకు హాజరవ్వ వలెను.
Prajavartha Online Telugu News