Breaking News

స్వచ్ఛత హి సేవా ప్రతిజ్ఞ

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త :
స్వచ్చత హి సేవా లో భాగంగా గుంటూరు నగరపాలక సంస్థ పరిధిలో మంగళవారం తెల్లవారుజామున 5:30 గంటల ప్రజారోగ్య కార్మికుల మస్టర్ పాయింట్స్, వివిధ ప్రభుత్వ, ప్రైవేట్ విద్యా సంస్థలు, ప్రభుత్వ కార్యాలయాల్లో, వార్డ్ సచివాలయాల్లో ప్రజలు, ప్రజాప్రతినిధులు, వివిధ స్వచ్చంద సంస్థల ప్రతినిధులు, యువత భాగస్వామ్యంతో షుమారు 1.25 లక్షల మందితో స్వచ్ఛత హి సేవా ప్రతిజ్ఞ చేపట్టామని గుంటూరు నగర కమిషనర్ పులి శ్రీనివాసులు ఐఏఎస్  తెలిపారు. మంగళవారం నగరపాలక సంస్థ ప్రధాన కార్యాలయంలో స్వచ్చత హి సేవా ప్రతిజ్ఞను చేపట్టారు.
ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ స్వచ్చత హి సేవాలో పాల్గొనడం ద్వారా గుంటూరు నగరాన్ని స్వచ్చ నగరంగా తీర్చిదిద్దుకోవడంలో భాగస్వాములు కావడమేనన్నారు. నగరంలో ఈ నెల 17 నుంచి అక్టోబరు 1వ తేదీ వరకు ప్రజలు, ప్రజాప్రతినిధుల భాగస్వామ్యంతో స్వచ్ఛత హి సేవా కార్యక్రమాలు నిర్వహించనున్నామని, కార్యక్రమాల వారీగా విధులు కేటాయించబడిన అధికారులు అంకిత భావంతో పని చేయాలన్నారు.
నగరంలో ఈనెల 17న ప్రజలు, వివిధ సంస్థల భాగస్వామ్యంతో స్వచ్చ ప్రతిజ్ఞ, 18న పార్క్స్, పబ్లిక్ ప్రాంతాలు శుభ్రం, ప్రజారోగ్య కార్మికులకు ప్రధమ చికిత్సపై శిక్షణ, కార్మికులకు వైద్య శిబిరాలు, బ్లీచింగ్‌, దోమల నివారణ మందులు పిచికారీ, నీరు నిలిచిపోయే ప్రదేశాలను శుభ్ర పరచడం, 19న ప్రతి ఒక్కరూ ఈ రోజు సైకిల్ వినియోగించడం, వార్డ్ సభలు, మెగా క్లీన్ కార్యక్రమం, వెంట్ పైప్ లకు నైలాన్ నెట్ల ఏర్పాటు, 20న ప్లాంటేషన్‌ డ్రైవ్‌, 21న కాలుష్య రహిత నగర సాధనపై విద్యార్ధులకు పెయింటింగ్ పోటీలు, రోడ్ పక్కన ఉండే డస్ట్ తొలగింపు, స్పెషల్ వ్యాక్సినేషన్ డ్రైవ్ చేపట్టడం జరుగుతుందన్నారు. 22న రూఫ్ టాప్ గార్డెనింగ్ పై అవగాహన, శుభ్రం, పార్క్ ల నిర్వహణ, 23న విద్యార్ధులకు వాయు కాలుష్యం పై వ్యాసరచన పోటీలు, డిబేటింగ్, ప్రజారోగ్య కార్మికులు, వారి కుటుంబ సభ్యులకు మెడికల్ క్యాంప్ లు, 24న సైక్లాధాన్, గాలి కాలుష్యం పై నాటికలు, డ్రైన్ల పూడికతీత, 25న స్వచ్చందంగా ట్రాఫిక్ నియంత్రణలో పాల్గొనడం, దేవాలయాలు శుభ్రం, ఫాగింగ్, 26న మొక్కలు నాటడం, రోడ్ మీదియన్స్, పుట్ పాత్ ల శుభ్రం, ప్రజారోగ్య కార్మికులకు హెల్త్ ఇన్సూరెన్స్, 27న వ్యర్ధాలను వేరు వేరుగా విభజన చేయడంపై విద్యార్ధులకు అవగాహన, రోడ్ల ఆక్రమణల తొలగింపు, 28న మానవహారం, 29న నగరంలో నిర్వహించిన వివిధ పోటీల్లో విజేతలుగా నిలిచిన వారికి అభినందన సభ, ముఖ్యమైన అతిధుల ఉపన్యాసం, వీధి నాటికల ప్రదర్శన, 30న వ్యర్ధాల నిర్వహణపై ప్రజలకు అవగాహన, నీరు నిలిచిన ఖాళీ స్థలాల్లో ఆయిల్ బాల్స్ వేయడం, 1 అక్టోబర్ న స్వచ్చత హాయ్ సేవా కాన్సెప్ట్ పై విద్యార్ధులతో మానవహారం, వాయు కాలుష్య నియంత్రణపై వీధి నాటికల ప్రదర్శన, కమర్షియల్ మార్కెట్స్ మాస్ క్లీనింగ్ కార్యక్రమాలు జరుగుతాయన్నారు. నోడల్ అధికారుల వారీగా ఆయా కార్యక్రమాల్లో స్తానిక ప్రజా ప్రతినిధులను, సిబ్బందిని భాగస్వాములను చేయాలని కోరారు.
కార్యక్రమంలో అదనపు కమిషనర్ కె.రాజ్యలక్ష్మీ, డిప్యూటీ కమిషనర్లు సిహెచ్,శ్రీనివాస్, టి.వెంకట కృష్ణయ్య, సిటి ప్లానర్ రాంబాబు, ఎస్.ఈ. శ్యాం సుందర్, ఎంహెచ్ఓలు మధుసూదన్, రామారావు, మేనేజర్ ప్రసాద్, అధికారులు, కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.

Check Also

మద్దిరాలపాడు పర్యటనలో…

ఒంగోలు, నేటి పత్రిక ప్రజావార్త : మద్దిరాలపాడు పర్యటనలో భాగంగా తాళ్లూరి జగ్గయ్య (67), పార్వతి దంపతుల ఇంటికి ముఖ్యమంత్రి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *