Breaking News

తిరుపతి నగర పరిశుభ్రత ప్రతి ఒక్కరి బాధ్యత- ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు.

-నగరాన్ని శుభ్రంగా ఉంచుదాం-ఎమ్మెల్సీ సిపాయి
-పరిశుభ్రతపై ప్రజలకు అవగాహన కార్యక్రమాలు – కమిషనర్ మౌర్య

తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త :
పవిత్ర పుణ్యక్షేత్రమైన తిరుపతి నగరాన్ని పరిశుభ్రంగా ఉంచడం ప్రతి ఒక్కరి బాధ్యత అని ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు, ఎమ్మెల్సీ సిపాయి సుబ్రమణ్యం కమిషనర్ ఎన్.మౌర్య సంయుక్తంగా అన్నారు. స్వచ్ఛత హి సేవ కార్యక్రమంలో భాగంగా నగర పాలక సంస్థ ఆధ్వర్యంలో మంగళవారం ఉదయం మహతి ఆడిటోరియం నుంచి తారకరామ స్టేడియం వరకు నిర్వహించిన ర్యాలీని ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు, ఎమ్మెల్సీ డాక్టర్ సిపాయి సుబ్రమణ్యం, కమిషనర్ ఎన్. మౌర్య, కార్పొరేటర్లు నరసింహాచారి, కల్పన, నారాయణ, అధికారులు, జెండా ఊపి ప్రారంభించారు.

ఈ సందర్బంగా ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు మాట్లాడుతూ పుణ్యక్షేత్రమైన తిరుపతిని పరిశుభ్రంగా ఉంచాల్సిన బాధ్యత అందరిపై ఉందని అన్నారు. వ్యక్తిగత శుభ్రత ఎంత ముఖ్యమో పరిసరాల పరిశుభ్రత అంతే ముఖ్యమని అన్నారు. నగరంలో అపరిశుభ్రతకు ఏ ఒక్కరూ తావు ఇవ్వకూడదు అన్నారు. ప్రధాని మోది ప్రవేశపెట్టిన గొప్ప పథకం స్వచ్ఛభారత్ అన్నారు. మోది స్ఫూర్తితో రాష్ట్రంలో స్వచ్చత హి సేవ కార్యక్రమాన్ని సిఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అమలు చేస్తున్నారని అన్నారు. పరిసరాల పరిశుభ్రతతో ఆరోగ్యవంత సమాజం సాధ్యమని అన్నారు. తిరుపతిని స్వచ్చత హి సేవ లో దేశంలోనే మొదటి స్థానంలో నిలిపేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఎమ్మెల్సీ డాక్టర్ సిపాయి సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ అందరూ కలిసికట్టుగా కృషి చేసి తిరుపతి నగరాన్ని పరిశుభ్రంగా ఉంచుకుందామని అన్నారు. నగరంలో పారిశుద్ధ్య నిర్వహణలో ప్రతి ఒక్కరు నగరపాల సంస్థ సిబ్బందికి సహకరించాలన్నారు. స్వచ్ఛ భారత్ నిర్మాణంలో ప్రతి ఒక్కరు భాగస్వాములు కావాలని అన్నారు. తిరుపతి పరిశుభ్రంగా ఉంచాలని పిలుపునిచ్చారు.

కమిషనర్ ఎన్.మౌర్య మాట్లాడుతూ స్వచ్ఛత హి సేవ లో భాగంగా నగరంలో పారిశుధ్యం పై ప్రజలకు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని అన్నారు. రెండు వారాలు పాటు ఈ కార్యక్రమాలు చేస్తున్నామని అన్నారు. నగరంలోని ప్రతి ఒక్కరు తమ ఇల్లు, హాస్పిటల్స్, కార్యాలయాల తో పాటు పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని అన్నారు. చెత్త ఎక్కడపడితే అక్కడ వేయకుండా ప్రతి ఒక్కరు సామాజిక బాధ్యతతో వ్యవహరిస్తే నగరం పరిశుభ్రంగా ఉంటుందన్నారు. ఈ స్వచ్ఛత హి సేవ లో భాగంగా వేస్ట్ ఆర్ట్, వాల్ ఆర్ట్ పోటీలు నిర్వహిస్తున్నామని అన్నారు. పారిశుధ్య కార్మికులకు హెల్త్ చెకప్ చేయిస్తున్నామని అన్నారు. నగరంలో ఖాళీ ప్రదేశాలని శుభ్రం చేసి మొక్కలు నాటే కార్యక్రమం చేపడుతున్నామని అన్నారు. పరిశుభ్రత అనేది మున్సిపాలిటీ, ప్రభుత్వానిదే బాధ్యత కాదని, ప్రతి ఒక్కరి బాధ్యత అని గుర్తించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ కమిషనర్ అమరయ్య, మహిళా వర్సిటీ వి.సి.ప్రొఫసర్ ఉమా, రిజిస్ట్రార్ రజని, అడిషనల్ ఎస్పీ రవి మనోహరాచారి,, జిల్లా వైద్యాధికారి డాక్టర్ శ్రీహరి, టూరిజం రిజినల్ డైరెక్షర్ రమణ ప్రసాద్, సెట్విన్ సిఈఓ మురళికృష్ణ, మునిసిపల్ ఇంజినీర్లు చంద్రశేఖర్, వెంకట్రామిరెడ్డి, హెల్త్ ఆఫీసర్ డాక్టర్ యువ అన్వేష్, డి.సి.పి. శ్రీనివాసులు రెడ్డి, డి.ఈ. విజయకుమార్ రెడ్డి, రెవిన్యూ ఆఫీసర్లు సేతుమాధవ్, కె.ఎల్.వర్మ, మేనేజర్ చిట్టిబాబు, పెద్ద సంఖ్యలో విద్యార్థులు, ప్రజలు పాల్గొన్నారు.

Check Also

మద్దిరాలపాడు పర్యటనలో…

ఒంగోలు, నేటి పత్రిక ప్రజావార్త : మద్దిరాలపాడు పర్యటనలో భాగంగా తాళ్లూరి జగ్గయ్య (67), పార్వతి దంపతుల ఇంటికి ముఖ్యమంత్రి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *