Breaking News

ప్రకృతి వ్యవసాయ పద్ధతుల్లో విత్తనం వేసిన మెక్సికో బృందం

-సామాన్య రైతులను శాస్త్రవేత్తలను చేయడం అమోఘం

తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త :
ప్రపంచ వ్యాప్తంగా పెరిగిపోతున్న ఉష్ణోగ్రతలు ఆందోళన కలిగిస్తున్నాయని, ఆంధ్ర ప్రదేశ్ లో అమలవుతున్న ప్రకృతి వ్యవసాయ కార్యక్రమం అనేక సవాళ్ళకు సమాధానం చూపగలవని మెక్సికో ప్రతినిధి బృందం కు నేతృత్వం వహిస్తున్న మెక్సికో ప్రభుత్వ ఏరియా డైరెక్టర్ డియాజ్ మరియాస్పష్టం చేశారు. తిరుపతి జిల్లాలో చేస్తున్న తమ మూడు రోజుల పర్యటనలో భాగంగా మూడవ రోజు 17 వ తేదీన రామచంద్రాపురం మండలంలోని గొల్లపల్లి గ్రామంలో స్థానిక రైతు సి. నాగరాజు వ్యవసాయ క్షేత్రంలో స్వయంగా విత్తనాలు వేసి ఎటీఎం, ఏ గ్రేడ్,డ్రాట్ ప్రూఫింగ్ మోడళ్లను వేసే ప్రక్రియలో పాలుపంచుకొన్నారు. ఏపీసీఎన్ఎఫ్ ప్రోటోకాల్స్ అనుసరించి పొలం సరిహద్ధులలో పంట సంరక్షణ కోసం జొన్న, మొక్కజొన్న, సజ్జ విత్తనాలు వేశారు. ప్రకృతి వ్యవసాయ పరిజ్ఞానాన్ని, అందులో దాగిఉన్న సైన్స్ ను పూర్తిగా అర్థం చేసుకొనేందుకు ఈ రోజు ప్రత్యక్షంగా ప్రకృతి వ్యవసాయ ఆదర్శ నమూనాలను వేయడంతో పాటు నేలకు ఘన జీవామృతం అందించి బీజామృతంతో విత్తన శుద్ధి చేసే ప్రక్రియ లో కూడా పాలు పంచుకొన్నారు. గొల్లపల్లి గ్రామానికి చెందిన నాగరాజు 2017 వ సంవత్సరం నుంచి తనకున్న 2.5 ఎకరాలలో ప్రకృతి వ్యవసాయ విధానాలను అనుసరిస్తున్నాడు.
అనంతరం మెక్సికో బృందం కొత్త కండ్రిగ పంచాయతీ పరిధిలోని టీవీ సపార్లు గ్రామంలో ఏపీసీఎన్ఎఫ్ సిబ్బంది మరియు రైతు సాధికార సంస్థ (ఆర్ వై ఎస్ ఎస్ ) ఆరోగ్య పోషణ విభాగానికి చెందిన ఇంటర్న్ లతో మాట్లాడి ప్రకృతి వ్యవసాయ అమలు విధానాలను అడిగి తెలుసుకొన్నారు. ఈ సంధర్భంగా మరియా మాట్లాడుతూ ఏపీసీఎన్ఎఫ్ ద్వారా ప్రజలు ముఖ్యంగా మహిళలు ప్రకృతి వ్యవసాయ కార్యక్రమంలో ఉత్సాహంగా పాల్గొనడం ఎంతగానో ఆకట్టుకొందని అన్నారు. రాష్ట్రంలో సామాన్య రైతులను శాస్త్రవేత్తలుగా తయారు చేసే విధానం అమోఘం అని కితాబు నిచ్చారు. ఆరోగ్య విభాగపు సిబ్బందితో మాట్లాడుతూ ప్రకృతి వ్యవసాయ కార్యక్రమంలో హెల్త్ అండ్ న్యూట్రీషన్ విభాగం పాత్రపై అనేక సందేహాలను నివృత్తి చేసుకొన్నారు .ఆర్ వై ఎస్ ఎస్ ఆరోగ్య విభాగపు థి మాటిక్ లీడ్ డాక్టర్ రాజగోపాల్ ప్రకృతి వ్యవసాయ ఉత్పత్తుల వినియోగం వల్ల ఆరోగ్యంలో వచ్చే మార్పులను ఉదాహరణలతో వివరించారు.
బృంద సభ్యులు కుప్పం బాదూర్ గ్రామంలో పర్యటించి సూర్యమండలం నమూనా లో తక్కువ విస్తీర్ణంలో వివిధ రకాల ఆకుకూరలు, కాయగూరలను పండించే పద్ధతులను తెలుసుకొన్నారు. మోడల్ ను సందర్శించారు రైతు సాధికార సంస్థ ద్వారా అమలవుతున్న ఆరోగ్యం పోషణ కార్యక్రమాలను, ఫుడ్ బాస్కెట్ ఫలితాలను లబ్దిదారులను అడిగి తెలుసుకొన్నారు.
ఈ కార్యక్రమంలో రైతు సాధికార సంస్థ సీనియర్ అధికారులు చక్రాల చంద్రశేఖర, కె . సురేష్ బాబు, స్మితా జాకోబ్, డాక్టర్ రాజగోపాల్, ఏపీసీఎన్ఎఫ్ తిరుపతి జిల్లా ప్రాజెక్టు మేనేజర్ షణ్ముగం,అదనపు మేనేజర్ పట్టాభి రెడ్డి, సీనియర్ కన్సల్టెంట్  సురేంద్ర రెడ్డి, ప్రాంతీయ టెక్నికల్ ఆఫీసర్ ఆరి రవి చంద్ర ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.

Check Also

మద్దిరాలపాడు పర్యటనలో…

ఒంగోలు, నేటి పత్రిక ప్రజావార్త : మద్దిరాలపాడు పర్యటనలో భాగంగా తాళ్లూరి జగ్గయ్య (67), పార్వతి దంపతుల ఇంటికి ముఖ్యమంత్రి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *