Breaking News

స్వచ్చత హి సేవ మానవహారం కార్యక్రమాన్ని ప్రారంభించిన జిల్లా కలెక్టర్ పి. ప్రశాంతి

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
వ్యక్తిగత శుభ్రత ఎంత ముఖ్యమో పరిసరాల పరిశుభ్రత అంతే ముఖ్యమని ఆ దిశగా జిల్లాను పరిశుభ్రంగా ఉంచాల్సిన బాధ్యత అందరిపై ఉందని జిల్లా కలెక్టర్ పి. ప్రశాంతి పేర్కొన్నారు. మంగళవారం స్థానిక వై జంక్షన్ నందు స్వచ్ఛత హి సేవా అంశం పై అవగాహాన.. మానవ హారం, సంతకాల సేకరణ కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ పి. ప్రశాంతి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో శాసనసభ్యులు ఆదిరెడ్డి వాసు, బత్తుల బలరామ కృష్ణ, కమీషనర్ కేతన గార్గ్, పెద్ద ఎత్తున పాల్గొన్న ఆరోగ్య కార్యకర్తలు, శానిటరీ సిబ్బంది, నగర ప్రజలు , మహిళలు పాల్గొన్నారు.

ఈ సందర్బంగా కలెక్టర్ పి. ప్రశాంతి మాట్లాడుతూ పరిసరాల పరిశుభ్రతతో ఆరోగ్యవంత సమాజం సాధ్యమవుతుందని, అపరిశుభ్రతకు ఏ ఒక్కరూ తావు ఇవ్వకుండా మన చుట్టూ ఉన్న ప్రదేశాలను పరిశుభ్రంగా ఉంచుదామన్నారు. పొల్యూషన్ కారణమైన ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించి, వాటిని రీసైకిల్ చేయటం అనే విధానాన్ని పాటిద్దామని, స్వచ్చత హి సేవ కార్యక్రమాలకు సంబంధించి ఈ 15 రోజులు కాలుష్య రహిత సమాజం పై ప్రతి ఒక్కరికి అవగాహన కల్పిద్దామన్నారు.

సిటీ శాసనసభ్యులు ఆదిరెడ్డి వాసు మాట్లాడుతూ ప్రధాని మోది ప్రవేశపెట్టిన గొప్ప పథకం స్వేచ్ఛ భారత్ అన్నారు. మోది స్ఫూర్తితో రాష్ట్రంలో స్వచ్చత హి సేవ కార్యక్రమాన్ని సిఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అమలు చేస్తున్నారు. ప్రతి ఒక్కరూ పర్యావరణ పరిశుభ్రత, కాలుష్య రహిత సమాజం కొరకు, మన చుట్టూ ఉన్న పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలన్నారు.

రాజానగరం శాసనసభ్యులు బత్తుల బలరామకృష్ణ మాట్లాడుతూ ప్రస్తుతం వరదలు నేపథ్యంలో మన చుట్టూ ఉన్న పరిసరాలను శుభ్రం చేయవలసిన పరిస్థితి నెలకొందని, ఆ దిశగా ప్రతి ఒక్కరూ తమ చుట్టుపక్కల ప్రాంతాలను పరిశుభ్రం చేస్తూ మన ఆరోగ్యాన్ని మనమే కాపాడుకోవాలన్నారు. దేశ ప్రధాని మోది పిలుపుమేరకు జిల్లాలో స్వచ్చత హి సేవ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ పాల్గొని పరిసరాల పరిశుభ్రతపై అవగాహన పెంచుకోవాలన్నారు.

మున్సిపల్ కమిషనర్ కేతన్ గార్గ్ మాట్లాడుతూ నగరంలో స్వచ్చత హి సేవ కార్యక్రమాలను 15 రోజులు పర్యావరణ, పరిసరాలు పరిశుభ్రత పై, నగర ప్రజలకు అవగాహన కల్పించే విధంగా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందన్నారు. విజయవాడ నగరంలో ఇటీవల వరదలు నేపథ్యంలో రాజమహేంద్రవరం నుంచి 3300 మంది సిబ్బందిని పంపించి అక్కడ పూర్తిస్థాయిలో శానిటేషన్ ఇతర కార్యక్రమాలను చేపట్టే దిశగా సేవలు అందించడం జరిగిందని పేర్కొన్నారు.
ఈ సందర్భంగా సంతకాలు సేకరణ, మానవహారం, స్వచ్ఛత హి సేవ కార్యక్రమాలపై ప్రతిజ్ఞచేయించి, 15 రోజులు నిర్వహించే కార్యక్రమాల పోస్టర్ కు ఆవిష్కరించారు.

ఈ కార్యక్రమంలో శాసనసభ్యులు ఆదిరెడ్డి వాసు, బత్తుల బలరామ కృష్ణ, కమీషనర్ కేతన గార్గ్, పెద్ద ఎత్తున పాల్గొన్న ఆరోగ్య కార్యకర్తలు, శానిటరీ సిబ్బంది, నగర ప్రజలు , మహిళలు పాల్గొన్నారు.

Check Also

మద్దిరాలపాడు పర్యటనలో…

ఒంగోలు, నేటి పత్రిక ప్రజావార్త : మద్దిరాలపాడు పర్యటనలో భాగంగా తాళ్లూరి జగ్గయ్య (67), పార్వతి దంపతుల ఇంటికి ముఖ్యమంత్రి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *