Breaking News

బీసీలకు పెద్దపీట

-రాష్ట్ర బీసీ, ఈడబ్ల్యూఎస్ సంక్షేమ, చేనేత మరియు జౌళిశాఖామాత్యులు ఎస్.సవిత
-సీఎం చంద్రబాబు నేతృత్వంలో బీసీ సంక్షేమ శాఖపై సమగ్ర సమీక్ష
-గడిచిన 5 ఏళ్లలో బీసీలు పూర్తిగా చితికిపోయారన్న మంత్రి
-ఎన్డీయే కూటమితో బీసీలకు పూర్వవైభవం రాక

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
బీసీలకు పెద్దపీట వేయనున్నట్లు రాష్ట్ర బీసీ, ఈడబ్ల్యూఎస్ సంక్షేమ, చేనేత మరియు జౌళిశాఖామాత్యులు ఎస్.సవిత తెలిపారు. మంగళవారం సచివాలయంలోని నాలుగో బ్లాక్ లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు. గడిచిన అయిదేళ్లలో బీసీలు పూర్తిగా చితికిపోయారన్నారు. చంద్రబాబు రాకతో బీసీలకు పూర్వ వైభవం వచ్చిందన్నారు. సీఎం చంద్రబాబునాయుడు నేతృత్వంలో సచివాలయంలో బీసీ కార్పొరేషన్, ఈడబ్ల్యూఎస్ పై సమీక్షా సమావేశం జరిగిందన్నారు. ఈ సందర్భంగా పలు కీలక నిర్ణయాలు తీసుకున్నామని మంత్రి తెలిపారు. మంత్రిగారి మాటల్లోనే…
బీసీ సంక్షేమం
1. గత ప్రభుత్వంలో ఉన్న రూ.110 కోట్ల డైట్ ఛార్జీల బకాయిలు విడుదలకు నిర్ణయం
2. రూ.20.52 కోట్ల కాస్మొటిక్ ఛార్జీల బకాయిల విడుదల నిర్ణయం
3. వసతి గృహాల్లో సాధారణ మరమ్మతులకు రూ.10 కోట్లు విడుదల
4. వసతి గృహ విద్యార్థులకు వ్యక్తిగతంగా ఇస్తున్న ట్రంకు పెట్టెలు, ప్లేట్లు, గ్లాసులు మరియు బెడ్డింగ్ మెటిరీయిల్ కోసం రూ.25 కోట్లు విడుదల నిర్ణయం
5. హాస్టల్ లో డిజిటిల్ కంటెంట్ తో విద్యా ప్రమాణాల పెంపుదలకు SR శంకరన్ రిసోర్స్ సెంటర్లు ఏర్పాటుకు నిర్ణయం
6. ప్రీ మెట్రిక్, పోస్టు మెట్రిక్ స్కాలర్ షిప్పుల నిమిత్తం కేంద్రం వాటా 133.78 కోట్లతో పాటు రాష్ట్ర వాటాగా 89.18 కోట్లు విడుదల నిర్ణయం
7. ఎన్టీఆర్ విదేశీ విద్యాపథకం కింద నాణ్యమైన విదేశీ విద్యా సంస్థల్లో అత్యధిక మంది విద్యార్థులకు అవకాశం కల్పించేలా చర్యలు
8. ఎన్టీఆర్ విద్యోన్నతి పథకం పునరుద్ధరణకు నిర్ణయం
9. చిత్తూరు, శ్రీకాకుళం మరియు కర్నూలు లో అసంపూర్తిగా నిలిచిపోయిన బీసీ భవనాల నిర్మాణానికి రూ. 8 కోట్లు విడుదల చేయాలని నిర్ణయం
10. మిగిలిన 23 జిల్లా కేంద్రాల్లోనూ బీసీ భవన్ల నిర్మాణానికి స్థలాలు గుర్తించి…నిర్మాణాలు చేపడతాం
11. బీసీ కమ్యూనిటీ హాళ్ల నిర్మాణాలపై నివేదికను కోరుతున్నాం
12. చట్ట సభల్లో బీసీలకు ప్రాతినిథ్యం పెంచేలా కేంద్ర ప్రభుత్వానికి సిఫార్సు చేయాలని నిర్ణయం
13. బీసీ ప్రొటెక్షన్ యాక్టు రూపకల్పనకు సీఎం ఆదేశం
14. బీసీ స్టడీ సర్కిళ్ల బలోపేతానికి రూ.10 కోట్లు విడుదలకు నిర్ణయం
15. 100 మంది అభ్యర్థులతో IAS స్టడీ సర్కిల్ ఏర్పాటు

బీసీ కార్పొరేషన్
1. బీసీ కార్పొరేషన్ పునర్వవస్థీకరించి.. బీసీల అభివృద్ధికి ప్రణాళికలు రూపొందిస్తాం
2. కమ్యూనిటీల వారీగా అభివృద్ధి ప్రణాళికలు రూపొందిస్తాం
3. బీసీ ఉప కులాలు ఎక్కడెక్క నివసిస్తున్నారు… వారి వృత్తులేంటి.. వారి తలసరి ఆదాయమెంత..? వంటి వివరాలకు సమగ్ర సర్వే చేస్తాం… ఈ సర్వే ఆధారంగా వారి ఆర్థిక పరిస్థితికి సమగ్ర కార్యాచరణ, ప్రణాళికులు సిద్ధం చేస్తాం
4. జాతీయ బీసీ కార్పొరేషన్ నుంచి ఏటా రూ.100 కోట్లు రాబట్టడానికి అవసరమైన మ్యాచింగ్ గ్రాంట్ ఇస్తాం
5. బీసీ నుంచి పారిశ్రామిక వేత్తలు వచ్చే విధంగా వారిలో ఆత్మవిశ్వాసాన్ని నింపేలా Entrepreneur Development Programmes ను రూపొందిస్తాం.
6. బీసీ-ఏలో ఉన్న అత్యంత వెనుకబడిన కులాల అభివృద్ధికి SEED (Scheme for Economic Empowerment of Denotified & Seminomadic Tribes) అభివృద్ధికి ప్రణాళిక సిద్ధం చేయుట..( కేంద్ర ప్రభుత్వం అనుసంధానంతో)
7. బీసీల వృత్తి నైపుణ్యాలను మెరుగుపరిచి పీఎం-విశ్వకర్మ పథకం వర్తింపజేసేలా చర్యలు

EWS
1. కులాల వారీగా తలసరి ఆదాయం ఆధారంగా బీపీఎల్ కుటుంబాలను గుర్తించి వారి ఆర్థికాభివృద్ధికి సమగ్ర ప్రణాళిక రూపొందిస్తాం
2. గత టీడీపీ ప్రభుత్వంలో 68 కాపు భవనాలకు అనుమతులు మంజారు చేయగా, వాటిలో నిర్మాణం చేపట్టి అసంపూర్తిగా నిలిచిపోయిన 2 భవనాలను పూర్తి చేయడానికి రూ.2.36 కోట్లు విడుదల చేయడానికి నిర్ణయం
3. మిగిలిన 66 కాపు భవనాల నిర్మాణాలకు ప్రణాళికలు రూపొందిస్తాం.
బీసీ గురుకుల విద్యాలయాలు
1. రాష్ట్రంలోని అన్ని బీసీ గురుకుల విద్యాలయాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు.
సీసీ కెమెరాలను ఆర్టీజీఎస్ కు అనుసంధానం చేసి… నిరంతరం మోనటరింగ్ చేస్తాం
2. ఉమ్మడి అనంతపురం జిల్లాలో నిర్మాణంలో ఉన్న 4 రెసిడెన్షియల్ స్కూళ్లు(గుండుమల, గుదిబండ, గోనెబావి, రొద్దం) పూర్తి చేసి ఈ విద్యా సంవత్సంలోనే వినియోగంలోకి తెస్తాం… ఇందుకోసం రూ.75 కోట్లు విడుదల చేస్తున్నాం
3. రాష్ట్రంలో 5 చోట్ల ఫ్యాకల్టీ డవలప్ సెంటర్లు ఏర్పాటు చేస్తున్నాం… ఈ సెంటర్ల ద్వారా విద్యార్థులకు నాణ్యమైన గురుకుల విద్యతో పాటు నైపుణ్యాభివృద్ధి కోర్సులు నేర్పిస్తాం అని మంత్రి సవిత తెలిపారు.

Check Also

రావి వెంక‌టేశ్వ‌ర‌రావు కి శుభాకాంక్ష‌లు తెలిపిన ఎంపి కేశినేని శివ‌నాథ్

విజ‌య‌వాడ, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్‌గా మాజీ ఎమ్మెల్యే రావి వెంకటేశ్వరరావు ప్ర‌మాణ స్వీకారం …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *