Breaking News

జిల్లాలో గృహ నిర్మాణ పనులు వేగవంతం చేయాలి…

మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త :
జిల్లాలో గృహ నిర్మాణ పనులు వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ అధికారులను ఆదేశించారు. బుధవారం మధ్యాహ్నం నగరంలోని కలెక్టరేట్ మినీ కాన్ఫరెన్స్ హాల్ నుండి జిల్లా కలెక్టర్ గృహ నిర్మాణం పై సంబంధిత ఇంజనీరింగ్ అధికారులతో టెలికాన్ఫెరెన్స్ నిర్వహించి మండలాల వారీగా పురోగతిని సమీక్షించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో గృహ నిర్మాణం పురోగతి నిదానంగా ఉందన్నారు. ముఖ్యంగా అవనిగడ్డ, గుడివాడ, పెడన నియోజకవర్గాలలో గృహ నిర్మాణం వెనుకబడి ఉందన్నారు. ఈ నెలాఖరు నాటికి 729 ఇల్లు పూర్తి కావాల్సి ఉందని, వచ్చే అక్టోబర్ మాసానికి 2,168 ఇల్లు పైకప్పు స్థాయి వరకు పూర్తి చేయాల్సి ఉందన్నారు. వచ్చే సంవత్సరం మార్చి మాసాంతానికి 12,613 ఇల్లు పూర్తి చేయాల్సి ఉందన్నారు.

ముఖ్యంగా అవనిగడ్డ, నాగాయలంక, మోపిదేవి, గుడివాడ, నందివాడ, పెడన బంటుమిల్లి మండలాల్లోని గ్రామ సచివాలయాల పరిధిలో ఇంజనీరింగ్ సహాయకులు గృహ నిర్మాణం పై సరైన దృష్టి పెట్టడం లేదన్నారు. కేంద్ర ప్రభుత్వం గృహ నిర్మాణం కోసం ఇచ్చే నిధులు వచ్చే సంవత్సరం మార్చి తో ముగుస్తుందని ఆలోగానే లబ్ధిదారులు తమ ఇల్లు పూర్తి చేసుకుంటే సంబంధిత ఇంటి నిర్మాణం బిల్లులను చెల్లించే అవకాశం ఉంటుందన్నారు. సమయం దాటితే నిధులు రావని, బిల్లులు చెల్లింపుకావని, సమస్యలు తలెత్తుతాయని స్పష్టంగా లబ్ధిదారులకు తెలియజేయాల్సి ఉంటుందన్నారు. గృహ నిర్మాణ యూనిట్ విలువ పెరుగుతుందని ఆలోచనలో కొందరు ఇల్లు నిర్మించుకొనుటకు ముందుకు రావడంలేదని తన దృష్టికి వచ్చిందని, పాత ఇల్లు మంజూరైన వారికి ముందు నిర్ణయించిన యూనిట్ విలువలోనే ఇల్లు పూర్తి చేసుకోవాలని వివరించాలన్నారు.

ఈ విషయమై లబ్ధిదారులను చైతన్యపరిచడంతో పాటు నియోజకవర్గంలోని ప్రజాప్రతినిధులను సమన్వయం చేసుకొని ఇళ్ల నిర్మాణం పురోగతి వేగవంతం చేయాలన్నారు. సచివాలయంలో పనిచేస్తున్న ఇంజనీరింగ్ అసిస్టెంట్లు గృహ నిర్మాణం పట్ల శ్రద్ధ చూపకపోవడం సరైనది కాదని స్పష్టం చేస్తూ పరిస్థితి ఇలాగే కొనసాగితే వారిని సస్పెండ్ చేయాల్సి వస్తుందని హెచ్చరించారు. ఈ టెలికాన్ఫరెన్స్లో జిల్లా గృహ నిర్మాణ అధికారి జివి సూర్యనారాయణ, డిపిఓ నాగేశ్వర్ నాయక్, గృహ నిర్మాణ సంస్థ డీఈలు, ఏఈలు, సచివాలయ ఇంజనీరింగ్ సహాయకులు పాల్గొన్నారు.

Check Also

మద్దిరాలపాడు పర్యటనలో…

ఒంగోలు, నేటి పత్రిక ప్రజావార్త : మద్దిరాలపాడు పర్యటనలో భాగంగా తాళ్లూరి జగ్గయ్య (67), పార్వతి దంపతుల ఇంటికి ముఖ్యమంత్రి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *