Breaking News

“ఐ.టి.ఐ, లలో మిగులు ఉన్న సీట్లు కోసం ధరఖాస్తులు ఆహ్వానం”

-“నాల్గవ విడత అడ్మిషన్”
-ప్రిన్సిపాల్ ఎల్.ఆర్.ఆర్.క్రిష్ణన్

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
పదవ తరగతి ఉత్తీర్ణులైన మరియు ఇంటర్మీడియట్ ఫెయిల్ అభ్యర్థులకు ఐ.టి.ఐ ల లో ప్రవేశం కొరకు తూర్పు గోదావరి జిల్లాలో గల ప్రభుత్వ మరియు ప్రవేట్ ఐ.టి.ఐ ల లో 2024-25 సంవత్సరమునకు గాను మిగులు ఉన్న సీట్లు కోసం “నాల్గవ విడత అడ్మిషన్స్” కొరకు ధరఖాస్తులు కోరడమైనది. అభ్యర్థులు తమ యొక్క అన్ని ధ్రువ పత్రములతో iti.ap.gov.in అను వెబ్సైట్ ద్వారా “05-09-2024 నుండి 26-09-2024 రాత్రి 11:59 గం”ల లోపు ధరఖాస్తు చేసుకుని రసీదు పొందవలెను. ధరఖాస్తు చేసుకున్న అభ్యర్థులుకు తేదీ.05-09-2024 నుండి 27.09.2024 సాయంత్రం 3:00 గం”ల వరకు వెరిఫికేషన్ పక్రియ జరుగుతుంది. కావున ధరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు ఒరిజినల్ సర్టిఫికెట్స్ మరియు ఒక జత జిరాక్స్ కాఫీలతో వచ్చి వెరిఫికేషన్ చేయించుకుని రశీదు పొందవలెను. పూర్తి వివరములకు 9294050231 మరియు 7801095303 నంబర్స్ లలో సంప్రదించ వచ్చునని ప్రిన్సిపాల్ ఎల్.ఆర్.ఆర్.క్రిష్ణన్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు.

Check Also

మద్దిరాలపాడు పర్యటనలో…

ఒంగోలు, నేటి పత్రిక ప్రజావార్త : మద్దిరాలపాడు పర్యటనలో భాగంగా తాళ్లూరి జగ్గయ్య (67), పార్వతి దంపతుల ఇంటికి ముఖ్యమంత్రి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *