Breaking News

ప్రపంచ పర్యాటక దినోత్సవ పోటీల గోడ పత్రిక ను ఆవిష్కరించిన జిల్లా కలెక్టర్ డా.ఎస్.వెంకటేశ్వర్

తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త :
నేటి బుధవారం స్థానిక జిల్లా కలెక్టరేట్ నందు ఈనెల సెప్టెంబర్ 27న జరగనున్న ప్రపంచ పర్యాటక దినోత్సవాన్ని పురస్కరించుకొని ప్రపంచ పర్యాటక దినోత్సవ పోటీల గోడ పత్రికను జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ ఆవిష్కరించి జిల్లాలో సదరు పోటీలలో ఔత్సాహికులు పాల్గొని ఉత్తమ వీడియోలు/ రీల్స్ తయారు చేయాలని వాటికి బహుమతులు ఉంటాయని తెలిపారు.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ సెప్టెంబర్ 27న జరగనున్న ప్రపంచ పర్యాటక దినోత్సవాన్ని పురస్కరించుకొని తిరపతి జిల్లాలోని ప్రముఖ పర్యాటక కేంద్రాల సమాచారాన్ని పర్యాటకులకు తెలియజేసి పర్యాటకులను ఆకట్టుకుని పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేయడానికి జిల్లాలోని ప్రముఖ పర్యాటక ప్రాంతాల ప్రాముఖ్యతను తెలియజేస్తూ ఉత్తమమైన వీడియోలు/ రీల్స్ పోటీలను నిర్వహించనున్నామని తెలిపారు. ఇందులో భాగంగా పోటీలను రెండు విభాగాలుగా కేటగిరీ 1, కేటగిరి 2 గా విభజించడం జరిగిందని తెలిపారు. కేటగిరి 1 లో భాగంగా ప్రముఖ ఆధ్యాత్మిక పర్యాటక కేంద్రాలైన శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయం (తిరుమల),శ్రీ గోవిందరాజస్వామి ఆలయం(తిరుపతి), శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయం ( తిరుచానూరు), శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి ఆలయం (అప్పలాయగుంట), శ్రీ పరశురామేశ్వర స్వామి ఆలయం ( గుడిమల్లం), శ్రీకాళహస్తీశ్వర స్వామి ఆలయం ( శ్రీ కాళహస్తి), శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయం (నారాయణవనం), శ్రీ వేదనారాయణ స్వామి ఆలయం ( నాగలాపురం), శ్రీ పల్లికొండేశ్వర స్వామి ఆలయం ( సురుటుపల్లి), వాటిపై ఒక నిమిషం నిడివి గల వీడియో, 15 – 30 సెకండ్ల రీల్ సమర్పించవలసి ఉంటుందని తెలిపారు. కేటగిరి 1 లో అత్యుత్తమ వీడియో లేదా రీల్స్ సమర్పించిన వారికి మొదటి బహుమతిగా రూ. 1,00,000/-, రెండవ బహుమతి గా రూ. 50,000/-, మూడవ బహుమతి గా రూ. 25,000/- అందివ్వడం జరుగుతుందని తెలిపారు.

కేటగిరి 2 లో భాగంగా తిరుపతి జిల్లాలోని ప్రముఖ విశ్రాంత మరియు ఆకర్షిత పర్యాటక ప్రదేశాలైన ఎస్ వి జూలాజికల్ పార్క్ (తిరుపతి), కళ్యాణి డ్యాం, చంద్రగిరి కోట, తలకోన జలపాతం, తలకోన, మామండూరు ఎకో టూరిజం, కైలాసనాథ కోన జలపాతం, శ్రీ సిటీ (సత్యవేడు), తూపిలిపాలెం బీచ్ (వాకాడు), ఇరకం ఐలాండ్, పులికాట్ లేక్, నేలపట్టు పక్షుల అభయారణ్యం వాటి పై వాటిపై ఒక నిమిషం నిడివి గల వీడియో, 15 – 30 సెకండ్ల రీల్ సమర్పించవలసి ఉంటుందని తెలిపారు. కేటగిరి 2 లో అత్యుత్తమ వీడియో లేదా రీల్స్ సమర్పించిన వారికి మొదటి బహుమతిగా రూ. 1,00,000/-, రెండవ బహుమతి గా రూ. 50,000/-, మూడవ బహుమతి గా రూ. 25,000/- అందివ్వడం జరుగుతుందని తెలిపారు.

పోటీలో తీసిన రీల్స్ మరియు వీడియోలను ‘edtpt@aptdc.in’ లేదా collector-tirupati@ap.gov.in ఈమెయిల్ ద్వారా పంపాలని తెలిపారు.

చివరగా పోటీలో పాల్గొను అభ్యర్థులు వారు తీసిన వీడియోలు , రీల్స్ ను 24.09.2024 వ తేది లోపు పై తెలిపిన ఈ మెయిల్ లకు పంపగలరని తెలిపారు.

ఇతర వివరములకు tirupati.ap.gov.in వెబ్సైట్ ను సంప్రదించగలరని, ప్రాంతీయ పర్యాటక కార్యాలయం తిరుపతి జిల్లా పర్యాటక అధికారి వారి నం : 6309942027,
ఇతర నెంబర్లు 9848823086,9705933311 ను సంప్రదించగలరని తెలిపారు.

ఈ కార్యక్రమంలో ప్రాంతీయ పర్యాటక శాఖ అధికారి రమణ ప్రసాద్, జిల్లా పర్యాటక శాఖ అధికారి రూపేంద్ర నాథ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Check Also

మద్దిరాలపాడు పర్యటనలో…

ఒంగోలు, నేటి పత్రిక ప్రజావార్త : మద్దిరాలపాడు పర్యటనలో భాగంగా తాళ్లూరి జగ్గయ్య (67), పార్వతి దంపతుల ఇంటికి ముఖ్యమంత్రి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *