Breaking News

హోం మంత్రి అనితను కలిసిన ముంబయ్ నటి జెత్వాని

-కుక్కల విద్యాసాగర్ పెట్టిన అక్రమ కేసులు ఎత్తివేయాలని హోంమంత్రిని కోరిన నటి జెత్వాని
-కేసు ముగిసే వరకూ విజయవాడలో భద్రత కల్పించాలంటూ వినతిపత్రం అందజేసిన ముంబయ్ నటి
-నిందితులు ఎంతటివారైనా చట్టపరంగా శిక్షిస్తామని ధైర్యం చెప్పిన హోంమంత్రి
-ఐపీఎస్ లపై చర్యలు తీసుకున్నందుకు హోంమంత్రికి కృతజ్ఞతలు తెలిపిన జెత్వాని కుటుంబం

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
ముంబయ్ నటి జెత్వాని కేసులో ఎంతటివారున్నా చట్టపరంగా శిక్షపడేలా చేస్తామని హోంమంత్రి వంగలపూడి అనిత వెల్లడించారు. సచివాలయంలోని హోంమంత్రి ఛాంబర్ లో కుటుంబ సభ్యులతో సహా తనను కలవడానికి వచ్చిన ముంబయ్ నటి జెత్వానికి హోంమంత్రి అనిత ధైర్యం చెప్పారు. ఇప్పటికే ముగ్గురు ఐపీఎస్ అధికారులపై చట్టపరంగా చర్యలు తీసుకున్న విషయాన్ని హోం మంత్రి గుర్తు చేశారు. అందుకు ముంబయ్ నటి జెత్వాని ప్రభుత్వం, హోం మంత్రికి కృతజ్ఞతలు తెలిపారు. తనపై కుక్కల విద్యాసాగర్ పెట్టిన అక్రమ కేసులు ఎత్తివేయాలని హోంమంత్రిని నటి జెత్వాని కోరారు. కేసు ముగిసేవరకూ విజయవాడలో ఉన్నప్పుడు తనకు భద్రత కల్పించాలని నటి జెత్వాని హోంమంత్రికి వినతి పత్రం అందజేశారు. దీనిపై స్పందించిన హోంమంత్రి భద్రత విషయంలో భయపడాల్సిన అవసరంలేదని లోతైన విచారణ చేసి నిందితులకు శిక్షపడే వరకూ ప్రభుత్వం, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సహా అందరూ ఆమెకు అండగా ఉంటామన్నారు. కొత్త ప్రభుత్వం స్పందించిన తీరు వల్లే ధైర్యంగా తమ బాధను గొంతు విప్పి చెప్పుకోగలిగామని ముంబయ్ నటి జెత్వాని తండ్రి హోంమంత్రితో అన్నారు. కేసు నమోదైన అనంతరం తన వ్యక్తిత్వ హననానికి పాల్పడిన పత్రిక, ఛానల్ ల గురించి ముంబయ్ నటి జెత్వాని హోంమంత్రికి బావోద్వేగంతో వివరించారు. భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చి 75 ఏళ్లయినా ఇంకా స్వేచ్ఛ రాలేదనడానికి నీ పరిస్థితి మరో ఉదాహరణ అంటూ హోంమంత్రి అనిత జెత్వానిని ఓదార్చారు.

Check Also

మద్దిరాలపాడు పర్యటనలో…

ఒంగోలు, నేటి పత్రిక ప్రజావార్త : మద్దిరాలపాడు పర్యటనలో భాగంగా తాళ్లూరి జగ్గయ్య (67), పార్వతి దంపతుల ఇంటికి ముఖ్యమంత్రి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *