Breaking News

జైలు వాతావరణం జైలులా కాకుండగా ఆశ్రమ వాతావరణమును తలపిస్తుంది

-జైలు వాతావరణం జైలులా కాకుండగా ఆశ్రమ వాతావరణమును తలపిస్తుంది
-మహిళా ఖైదీలతో మాట్లాడి వారి క్షేమ సమాచారం తెలుసుకున్న..
-రాష్ట్ర మహిళా కమిషన్ చైర్మన్
-గజ్జల వెంకటలక్ష్మి

రాజమహేంద్రవరం,  నేటి పత్రిక ప్రజావార్త :
ఆంధ్రప్రదేశ్ మహిళా కమిషన్ చైర్ పర్సన్ గజ్జల వెంకటలక్ష్మి రాజమండ్రిలో రెండు రోజులు పర్యటనలో భాగంగా నేషనల్ కమిషన్ ఫర్ వుమెన్ న్యూఢిల్లీ వారి ఆదేశానుసారం స్పెషల్ ప్రిజన్ ఫర్ వుమెన్ రాజమహేంద్రవరంను రెండు రోజులు సందర్శించినారు. ఇందులో భాగంగా రెండవ రోజు శుక్రవారం జైలు మొత్తం తిరిగి చూసినారు. జైలు బ్యారక్కులు, కిచెన్, బెకెరి, స్కూల్, లైబ్రరీ, పిల్లల యొక్క విభాగం, పాక్షిక ఆరు బయలు జైలు సందర్శించి మొత్తం తనిఖీ చేసారు. మహిళా ఖైదీలతో మాట్లాడి వారియొక్క క్షేమ సమాచారములు వారికీ ఏర్పాటు చేయుచున్న సౌకర్యాలు గురించి ఆరా తీసి వారికి మంచి పరివర్తన కౌన్సిలింగ్ నిర్వహించడం జరిగింది.

రాష్ట్ర మహిళా కమిషన్ చైర్ పర్సన్ గజ్జల వెంకటలక్ష్మి జైలు ను పరిశీలించిన అనంతరం మాట్లాడుతూ జైలు యొక్క వాతావరణం చాలా బాగుందని ఇది జైలులా కాకుండగా ఆశ్రమ వాతావరణమును తలపిస్తుందన్నారు. ఇంత వరకు సందర్శించిన జైలు లో స్పెషల్ ప్రిజన్ ఫర్ వుమెన్ రాజమహేంద్రవరం ఉత్తమ జైలుగా కొనియాడారు. ఖైదీలందరూ ఆరోగ్యముగా ఉన్నారని వారియొక్క భోజనం చాల రుచిగా ఉన్నడని బేకరీలో తయారు చేసిన బ్రెడ్ బిస్కట్స్ చాల బావున్నాయని మరియు సుదార్ పిండి వంటలు కూడా చాలా బావున్నాయని ఫుడ్ లైసెన్స్ సర్టిఫికెట్ తీసుకున్నందుకు మెచ్చుకున్నారు.

మొదటి రోజు గురువారం మహిళా కమిషన్ చైర్ పర్సన్  గజ్జల వెంకటలక్ష్మి ఆరు బయలు జైలును సందర్శించి అక్కడ హెర్బల్ మొక్కలు, ఫలసాయం మొక్కలు, పూల మొక్కలు నాటారు. మహిళ ఖైదీలకు డెంటల్  పరీక్షలు జరిపినారు. స్త్రీల సంబంధిత వ్యాధుల నిమిత్తం గైనకాలజీ డాక్టర్లచే టెస్ట్ చేయించి, పిల్లల నిమిత్తం చిల్డ్రన్ స్పెషలిస్ట్ లు వచ్చి పిల్లలకు వైద్య పరీక్షలు  నిర్వ హించారు. మహిళా ఖైదీలకు జనరల్ మెడికల్ హెల్త్ క్యాంపు నిర్వహించారు. అనంతరం జైలును సందర్శించి  7వ రాష్ట్రీయ మా పోషణ మాహ్ కార్యక్రమం ప్రారంభించి ఖైదీలకు పోషకాహారం యొక్క విశిష్టత గురించి తెలియజేశారు.

మహిళా కమిషన్ చైర్ పర్సన్ గజ్జల వెంకటలక్ష్మి రెండు రోజులు పర్యటనలో భాగంగా రెండవ రోజు శుక్రవారం స్థానిక ఆర్ అండ్ బి అతిధి గృహంలో రాజమహేంద్రవరం, ఎవిఎ రోడ్ శారదా నగర్ కు చెందిన మద్దుకూరి ప్రవీణ చౌదరి కలసి తన భర్త, అత్తమామలు, ఆడపడుచు వేధిస్తున్నారని వారి నుండి తనకు రావాల్సిన ఆర్థిక చేయూత కల్పించడంతో పాటు తనకు న్యాయం చేయాలని కమిషన్ చైర్ పర్సన్ వారికి వివరిస్తూ దరఖాస్తు అందజేశారు. ఈ సందర్భంగా ఛైర్పపర్సన్ స్పందిస్తూ న్యాయం చేసే విధంగా తగు చర్యలు తీసుకోవడం జరుగుతుందని హామీ ఇచ్చారు.

ఈ కార్యక్రమములో మహిళా కమిషన్ చైర్ పర్సన్ గజ్జల వెంకటలక్ష్మి వెంట మహిళాభివృద్ధి సంక్షేమ శాఖ ప్రాజెక్ట్ డైరెక్టర్ కె.విజయ కుమారి, జైలు సూపరింటెండెంట్ సిహెచ్. వసంత కుమారి, జైలరు, డిప్యూటీ జైలరు, మెడికల్ ఆఫీసర్, సైకియాట్రిస్ట్, పీడియాట్రిషన్, డెంటిస్ట్, మహిళ కమిషన్ లీగల్ కౌన్సిలర్ పూజిత యాదవ్, మహిళా కమిషన్ సూపర్నెంట్ మాధవి, పర్సనల్ సెక్రటరీ నాగమణి తదితరులు పాల్గొన్నారు.

Check Also

మద్దిరాలపాడు పర్యటనలో…

ఒంగోలు, నేటి పత్రిక ప్రజావార్త : మద్దిరాలపాడు పర్యటనలో భాగంగా తాళ్లూరి జగ్గయ్య (67), పార్వతి దంపతుల ఇంటికి ముఖ్యమంత్రి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *