విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
పశ్చిమ శాసనసభ్యులు యలమంచిలి సత్యనారాయణ (సుజన చౌదరి) ఆదేశాలతో 48వ డివిజన్ పరిధిలో అనారోగ్యంతో మరణించిన పోలవరపు నూకరాజు వయసు 66 సం కుటుంబానికి ఆర్థిక సాయం అందించారు. ఎమ్మెల్యే కార్యాలయ సిబ్బంది కూటమి నాయకులతో కలిసి శనివారం వారి కుటుంబాన్ని పరామర్శించారు. రిక్షవాలా అయినటువంటి పోలవరపు నూకరాజు కుటుంబానికి ఆర్థిక సాయం అందజేయాలని భారతీయ జనతా పార్టీ డివిజన్ అధ్యక్షులు దేవిన హరిప్రసాద్ సుజనా దృష్టికి తీసుకెళ్లగా తక్షణమే మట్టి ఖర్చుల నిమిత్తం ఆర్థిక సాయం అందజేయాలని ఆదేశాలు జారీచేశారు . ఎమ్మెల్యే కార్యాలయ సిబ్బంది శనివారం ఆర్థిక సాయం అందజేశారు . కార్యకర్తలకు ఎన్డీఏ కూటమి అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. ఎమ్మెల్యే సుజనాకు వారి కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలియజేశారు.
Tags vijayawada
Check Also
తెలుగులో ప్రభుత్వ ఉత్తర్వులు ఇవ్వాలన్న కూటమి ప్రభుత్వ నిర్ణయం హర్షించదగ్గ పరిణామం
-రాష్ట్ర పర్యాటక,సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ -తెలుగు భాషకు సముచిత ప్రాధాన్యం దక్కిందన్న మంత్రి దుర్గేష్ అమరావతి, …