విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త:
ప్రముఖ ఎలక్ట్రిక్ స్కూటర్ బ్రాండ్ బిగాస్ కంపెనీ వారు తమ కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ ‘‘ఆర్‌యువి 350 మాక్స్’’ని లాంచ్ చేసారు, డిజైన్ పరంగా ఇది భారతదేశంలో అత్యంత ప్రత్యేకమైన స్కూటర్లలో ఒకటి మరియు నూతనమైన ఫీచర్లతో వస్తుంది. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్‌ను ఎం.కిషోర్‌బాబు సర్కిల్ ఇన్‌స్పెక్టర్ ఆఫ్ పోలీస్ లాంచ్ చేశారు. బిగాస్ ఎలక్ట్రిక్ స్కూటర్ల కొరకు ‘‘హితికా మోటార్స్’’ విజయవాడలో అధీకృత డీలర్. ఈ సందర్బంగా హర్షవర్ధన్ మేనేజింగ్ పార్టనర్, హితికా మోటార్స్ మాట్లాడుతూ బిగాస్ ‘‘ఆర్‌యువి 350 మాక్స్’’ డిజైన్ పరంగా భారతదేశంలో అత్యంత ప్రత్యేకమైన స్కూటర్లలో ఒకటి మరియు నూతనమైన ఫీచర్లతో వస్తుంది, ఇది ఎలక్ట్రిక్ స్కూటర్ ప్రపంచంలో చాలా అరుదు మరియు ‘‘ఆర్‌యువి 350 మాక్స్’’ భారతదేశంలో అభివృద్ధి చేయబడిరది మరియు భారతదేశంలో తయారు చేయబడిరది అందువల్ల ఇది భారతీయ పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని రూపొందించబడిరది, కేంద్ర ప్రభుత్వం వారి ఫేమ్ ॥ సబ్సిడీతో వస్తుంది. ‘‘ఆర్‌యువి 350 మాక్స్’’ 145 కిలో మీటర్ల అరై సర్టిఫైడ్ శ్రేణిని కలిగి ఉంది, ఇది రెగ్యులర్ రోజువారీ ప్రయాణాలు మరియు వాణిజ్య ప్రయోజనాల కొరకు కూడా ఉపయోగించబడుతుంది. కస్టమర్లు అన్ని రిజిస్ట్రేషన్ మోడల్స్ కొరకు లభ్యం అయ్యే ఫైనాన్స్ అతి తక్కువ డౌన్ పేమెంట్ రూ.4,999లు మరియు ఎక్స్‌చేంజి సౌకర్యం కుడా కలదు అని తెలియజేసారు. మరిన్ని వివరాల కోసం హితికా మోటార్స్-9949336051 సంప్రదించండి.
Tags vijayawada
Check Also
తెలుగులో ప్రభుత్వ ఉత్తర్వులు ఇవ్వాలన్న కూటమి ప్రభుత్వ నిర్ణయం హర్షించదగ్గ పరిణామం
-రాష్ట్ర పర్యాటక,సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ -తెలుగు భాషకు సముచిత ప్రాధాన్యం దక్కిందన్న మంత్రి దుర్గేష్ అమరావతి, …