-పవిత్ర ప్రసాదం లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి వినియోగంపై చర్చ
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ తో తిరుమల తిరుపతి దేవస్థానం (టి.టి.డి.) కార్యనిర్వహణాధికారి జె.శ్యామల రావు ఆదివారం మధ్యాహ్నం సమావేశమయ్యారు. తిరుమల శ్రీవారి ప్రసాదాలు అందించారు. పవిత్ర ప్రసాదం లడ్డూ తయారీలో వినియోగించిన నెయ్యి కల్తీతో కూడినదనీ, అందులో జంతు అవశేషాలు ఉన్నాయనే అంశంపై ఈవో పలు వివరాలను ఉప ముఖ్యమంత్రి గారికి తెలిపారు. గత పాలక మండలి హయాంలో నెయ్యి సరఫరాదారును ఎంపిక చేసిన ప్రక్రియను, ల్యాబ్ పరీక్షల్లో వెల్లడైన ఫలితాలను తెలిపారు. ప్రస్తుతం లడ్డూ ప్రసాదం, శ్రీవారి ప్రసాదాల తయారీలో నిబంధనలను, శాస్త్రోక్రమైన నియమాలను పకడ్బందీగా అమలు చేస్తున్నామని ఈవో తెలియచేశారు. టీటీడీ సంప్రోక్షణ కార్యక్రమాన్ని చేపడుతోందని తెలిపారు. ఈ సందర్భంగా ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కల్యాణ్ గారు పలు సూచనలు చేశారు. ధార్మిక అంశాలలో రాజీ వద్దని స్పష్టం చేశారు. భక్తుల మనో భావాలకు విఘాతం కలగకుండా చూడాలని సూచించారు.