-విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త:
విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర ఆదివారం సాయంత్రం కండ్రిక, పాయికాపురం, ప్రకాష్ నగర్, వాంబే కాలనీ, రాజీవ్ నగర్ ప్రాంతాలల పర్యటించి క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా విజయవాడ నగర పాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర మాట్లాడుతూ వరద ప్రభావితమైన 32 వార్డుల సచివాలయాల్లో వరద వల్ల ప్రజలకు కలిగిన నష్ట గణన తర్వాత వచ్చిన లబ్ధిదారుల జాబితాను 32 వార్డులో ఉన్న సచివాలయాల్లో ప్రదర్శించారని, వాటిలో ఏమైనా అభ్యంతరాలు ఉన్నచో ప్రజలు దాన్ని స్పెషల్ ఆఫీసర్ మరియు డిస్ట్రిక్ట్ ఆఫీసర్ ని తెలుపవచ్చని విజయవాడ నగరపాలక సంస్థ శనివారం ప్రకటించగా దానికి ప్రతిస్పందనగా ఆదివారం 32 వార్డ్ లలో ఉన్న సచివాలయాలలో లబ్ధిదారుల జాబితాను ప్రజలు చూసుకోవడమే కాకుండా అభ్యంతరాలను వ్యక్తం చేస్తున్నారని అన్నారు. ఆ సచివాలయంలో ఉన్న వార్డ్ సెక్రెటరీ వచ్చిన వారి పేర్లను నమోదు చేసుకుంటున్నారని తదుపరి వాటిని పబ్లిక్ గ్రీవెన్స్ రెడ్ డ్రెస్సెస్ సిస్టంలో ఆన్లైన్ చేస్తారని తెలిపారు. ప్రజలు కేవలం ఆదివారమే కాకుండా సోమవారం కూడా వారి అభ్యంతరాలను తెలుపవచ్చని కమిషనర్ అన్నారు.