-“ఇది మంచి ప్రభుత్వం”
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
దేవ దేవుడికి జరిగిన అపచారానికి ప్రాయశ్చిత్తం చేసుకోవాలని పవన్ కల్యాణ్ ప్రాయశ్చిత దీక్షను మొదలు పెట్టారు అని, తిరుమల లడ్డు కల్తీ ఘటనను నిరసిస్తూ చేపట్టిన ప్రాయశ్చిత్త దీక్షకు సంఘీభావంగా మంత్రి నాదెండ్ల మనోహర్ తెనాలి లో మహా యాగం నిర్వహించారు ఈరోజు తెనాలిలోని శ్రీ లక్ష్మీ పద్మావతి సమేత శ్రీ వేంకటేశ్వర స్వామి దేవాలయం (వైకుంఠపురం)లో జరిగిన కార్యక్రమంలో మంత్రి నాదెండ్ల పాల్గొని మహా యాగం నిర్వహించారు.
“ఇది మంచి ప్రభుత్వం”
కూటమి ప్రభుత్వం ఏర్పడి 100 రోజుల పూర్తయిన సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తున్న “ఇది మంచి ప్రభుత్వం” కార్యక్రమంలో భాగంగా ఈ రోజు తెనాలి పట్టణంలో పలు ప్రాంతాల్లో వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ పర్యటించారు. పలు వాణిజ్య ప్రాంతాలలో వర్తకులతో మాట్లాడి వారి ఇబ్బందులను అడిగి తెలుసుకున్నారు… అదే విధంగా ప్రభుత్వం తరఫున అందించిన సంక్షేమం మరియు అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు వివరించారు.