-కలెక్టరేట్ లో 2600 మొక్కలు నాటే కార్యక్రమం
-కలెక్టర్ పి ప్రశాంతి, ఎమ్మెల్యే బుచ్చయ్య చౌదరి
రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
పర్యావరణ పరిరక్షణ లక్ష్యంగా “అకిరా మియావాకీ” కార్యక్రమాన్ని చేపట్టినట్లు జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి, ఎమ్మెల్యే బుచ్చయ్య చౌదరి లు పేర్కొన్నారు.
సోమవారం ఉదయం స్థానిక కలెక్టరేట్లో డ్వామా ఆద్వర్యంలో మొక్కలు నాటే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ పి ప్రశాంతి మాట్లాడుతూ, మొక్కలు నాటే కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున చేపట్టి పర్యావరణ సమతుల్యతను కాపాడుకుందామని విజ్ఞప్తి చేశారు. ఉపాధి హామీ పథకం కింద “అకిరా మియావాకీ” మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపట్టి కనీసం ప్రతి మండలంలో ఐదు నుంచి పది వరకు ప్రదేశాలను గుర్తించి , కనీసం 25 సెంట్లు స్థలాన్ని ఈ మొక్కలు పెంపకానికి చర్యలు తీసుకోవడం జరుగుతోందని జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి పేర్కొన్నారు. కలక్టరేట్ ఆవరణలో మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపట్టినట్లు తెలిపారు. 2600 మొక్కలని రూరల్ ఎమ్మెల్యే బుచ్చయ్య చౌదరి వారితో కలిసి ఈ బృహత్తర కార్యక్రమం చేపట్టినట్లు తెలిపారు. ప్రతి ఒక్కరూ ఒక మొక్కను నాటడం కాకుండా వాటి నిర్వహణ బాధ్యతలు స్వీకరించాలన్నారు.
ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి మాట్లాడుతూ, ఉపాధిహామీ పథకం తో అనుసంధానం చేసి పర్యావరణ పరిరక్షణ కోసం మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపట్టినట్లు తెలిపారు. పచ్చదనం పరిశుభ్రత కార్యక్రమంలో భాగంగా కలక్టరేట్ లో మొక్కలు నాటే కార్యక్రమాన్ని ఈరోజు నిర్వహించడం జరిగిందన్నారు. పంట భూములని, అడవులను నివాస ప్రాంతాలు గా మార్చడం వలన మొక్కలును నాటే స్థలం లేకుండా ఉండే పరిస్థితిని చూస్తున్నామన్నారు. పశు పక్ష్యాదులు కూడా స్వేచ్చగా జీవించే పరిస్థుతులు లేవన్నారు. మనలో ప్రతి ఒక్కరూ సామాజిక బాధ్యత తో మొక్కలు నాటే కార్యక్రమంలో భాగ్య స్వామి రావాలని భాగస్వామ్యం కావాలని ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి విజ్ఞప్తి చేశారు. దేశవ్యాప్తంగా మొక్కలు నాటే కార్యక్రమాన్ని దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పెద్ద ఎత్తున చేపట్టడం జరిగిందన్నారు. అదే స్ఫూర్తితో రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వం లో ప్రకృతి విపత్తులు, కరువు కాటకాలు నుంచి బయట పడాలంటే వాతావరణ సమతుల్యత పాటించాల్సి ఉందన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా వివిధ శాఖల అధికారులు మొక్కలు నాటే కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఈ కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి జి .నరసింహులు , డ్వామా ఇన్చార్జ్ పిడి ఆర్. శ్రీరాములు నాయుడు, జిల్లా అధికారులు ఎస్ మాధవరావు, ఎన్ వివి ఎస్ మూర్తి, జి. స్వామీ నాయుడు, కె ఎస్ జ్యోతి, తదితరులు పాల్గొన్నారు.