Breaking News

పెద్దకూరపాడులో రేపల్లె ఫాస్ట్ పాసింజర్, పల్నాడు ఎక్స్‌ప్రెస్ రైళ్ళను ఆపండి

-ఎంపి శ్రీకృష్ణదేవరాయలు, డి ఆర్ ఎం రామకృష్ణకి వినతి

పెద్దకూరపాడు, నేటి పత్రిక ప్రజావార్త :
పెద్దకూరపాడులో రేపల్లె-సికింద్రాబాద్ ఫాస్ట్ పాసింజర్, పల్నాడు ఎక్స్‌ప్రెస్ రైళ్ళకు హాల్ట్ ఇవ్వాలని కోరుతూ మూడువేలకు పైగా ప్రజల సంతకాలతో, స్థానిక సంస్థల తీర్మానాలతో కూడిన వినతి పత్రాన్ని నరసరావుపేట పార్లమెంటు సభ్యులు లావు శ్రీకృష్ణ దేవరాయలకు, గుంటూరు రైల్వే డివిజినల్ మేనేజర్ రామకృష్ణకు పెద్దకూరపాడు, పరిసరగ్రామాలకు చెందిన నాయకులు సోమవారం అందజేశారు. గుంటూరులో ఎంపి శ్రీకృష్ణదేవరాయల్ని ఆయన నివాసంలో కలిసి వినతిపత్రాన్ని అందజేయగా. రైల్వే శాఖ దృష్ఠికి తీసుకు వెళ్ళానని, అక్టోబరు 4వతేదీన విజయవాడలో రైల్వే డివిజన్ మీటింగ్ జరుగుతుందని, అందులో చర్చకు వచ్చేలా చూస్తానన్నారు. హాల్టు కోసం తప్పక కృషిచేస్తానని ఆయన హామీ ఇచ్చారు. తనవద్దకు వచ్చినవారు ఆ సమావేశానికి కూడా రావాలని అన్నారు.
అనంతరం గుంటూరు డివిజనల్ రైల్వే మేనేజర్ రామకృష్ణను వారి కార్యాలయంలో కలిసి వినతి పత్రాన్ని అందజేశారు. ప్రతినిధుల నుండి వివరాలు అడిగి తెలుసుకున్నారు. వినతిపై ఆయన సానుకూలంగా స్పందించారు. పైఅధికారుల దృష్ఠికి తీసుకు వెళతానని అన్నారు.
ఈ కార్యక్రమంలో సీనియర్ జర్నలిస్టు అభ్యుదయ రచయితల సంఘం కార్యదర్శి కె. శరచ్చంద్రజ్యోతిశ్రీ, ప్రజా కవి మరియు జిల్లా రైతుసంఘం సహాయ కార్యదర్శి దర్శి శేషారావు,ఎ పి వర్కింగ్ జర్నలిస్టు యూనియన్ నాయకులు నిమ్మరాజు చలపతిరావు, పెద్దకూరపాడు సర్పంచ్ గుడిపూడి రాజు, తెలుగుదేశం పార్టీ నాయకులు అర్తిమళ్ళ రమేష్, బెల్లంకొండ రామగోపాలరావు, మాజీ ఎంపిటిసి ముంతాజ్, గళ్ళా బాబు, వడ్లమూడి అప్పారావు,ఇతర ప్రజాసంఘాల నాయకులు సూరిబాబు, కొమ్మాలపాటి కోటేశ్వరరావు, చెరుకూరి రవి, పొట్టి సత్యనారాయణ, అత్తలూరు గ్రామానికి చెందిన మాదినేని వెంకట్రావు, కంభంపాడు చెందిన అర్తిమల్ల వెంకటకృష్ణారావు, మాదినేని వెంకట్రావు,గారపాడు చెందిన నెల్లూరి శ్రీనివాసరావు, ఇతర గ్రామాల నాయకులు పాల్గొన్నారు.

Check Also

ఎక్సైజ్ శాఖపై ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్ష

-గీత కులాలకు 10 శాతం మద్యం షాపుల కేటాయింపుపై నిర్ణయం -340 షాపులు ఇచ్చేందుకు వారం రోజుల్లో నోటిఫికేషన్ -రిటైల్ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *