తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త :
స్వర్ణాంధ్ర 2047 గోడ పత్రికను జెసి శుభం బన్సల్ తో కలిసి పిజిఆర్ఎస్ సమావేశ మందిరం నందు నేటి సోమవారం విడుదల చేసిన జిల్లా కలెక్టర్ డా.ఎస్. వెంకటేశ్వర్. ఈ సందర్భంగా కలెక్టర్ స్వర్ణాంధ్ర 2047 గోడ పత్రికను విడుదల చేసి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా స్వర్ణాంధ్ర విజన్ డాక్యుమెంట్ తయారీ ఆచరణాత్మకంగా ఉండేలా మండల, జిల్లా, రాష్ట్ర విజన్ డాక్యుమెంట్ తయారీకి మార్గదర్శకాలు జారీ చేసిన నేపథ్యంలో జిల్లా విజన్ డాక్యుమెంట్ పక్కాగా తయారు చేయాలనీ జిల్లా అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి పెంచల కిషోర్, ఎస్డిసీ లు చంద్రశేఖర్ నాయుడు, రామ్మోహన్, నరసింహులు, జిల్లా అధికారులు పాల్గొన్నారు.
Tags tirupathi
Check Also
తెలుగులో ప్రభుత్వ ఉత్తర్వులు ఇవ్వాలన్న కూటమి ప్రభుత్వ నిర్ణయం హర్షించదగ్గ పరిణామం
-రాష్ట్ర పర్యాటక,సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ -తెలుగు భాషకు సముచిత ప్రాధాన్యం దక్కిందన్న మంత్రి దుర్గేష్ అమరావతి, …