– ప్రతి చిన్నారికీ, ప్రతి మహిళకీ పోషకాహారం అందించి తీరుతాం
– రక్త హీనత సమస్యను అధిగమించడం ధ్యేయంగా అడుగులు వేస్తున్నాం
– మచిలీపట్నంలో పోషకాహార మాసిత్సవాల్లో పాల్గొన్న మంత్రి కొల్లు రవీంద్ర
మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త :
మహిళలు చిన్నారులను వేధిస్తున్న రక్తహీనత సమస్యను పారద్రోలడమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం నడుచుకుంటూందని రాష్ట్ర గనులు భూగర్భ వనరులు ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. మచిలీపట్నంలోని శారదానగర్లో నిర్వహించిన పౌష్టికాహార మాసోత్సవాల్లో పాల్గొన్నారు. చిన్నారులకు అన్నప్రాసన చేసి పోషకాహారాన్ని అందించారు. పలువురు గర్భిణులు, బాలింతలకు పోషకాహారం అందించి జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. రాష్ట్రంలో రక్తహీనత అనే సమస్యతో ఏ ఒక్కరూ బాధపడకుండా చూడడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం అడుగులు వేస్తోంది. అందుకే ప్రతి ఒక్కరికీ పోషకాహారాన్ని అందిస్తున్నాం అన్నారు. ఆరోగ్యవంతమైన సమాజం మా లక్ష్యం. అక్కడక్కడా నమోదవుతున్న రక్తహీనత సమస్యలను పరిష్కరించి ఆరోగ్యవంతమైన సమాజాన్ని రూపొందిస్తామని మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు.