Breaking News

పేదల కడుపు నింపాలన్నదే ప్రభుత్వ లక్ష్యం

-ఐదు రూపాయలకే రుచికరమైన టిఫెన్, భోజనం
-రాష్ట్రంలో ఎవరు ఆకలి కేకలతో అలమటించకూడదు
-రాష్ట్ర రవాణా, యువజన క్రీడ శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి

రాయచోటి, నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట్రంలో ఎవరు ఆకలితో అలమటించకుండా పేదల కడుపు నింపాలనదే ప్రభుత్వం యొక్క ముఖ్య ఉద్దేశమని రాష్ట్ర రవాణా, యువజన క్రీడా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి పేర్కొన్నారు. సోమవారం రాయచోటి పట్టణంలోని ఆర్టీసీ బస్టాండ్ నందు నూతనంగా ఏర్పాటుచేసిన అన్నా క్యాంటీన్ ను రాష్ట్ర రవాణా, యువజన క్రీడ శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి జిల్లా కలెక్టర్ శ్రీధర్ చామకూరితో కలిసి చేసి ప్రారంభించారు.

ఈ సందర్భంగా రాష్ట్ర రవాణా, యువజన క్రీడా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ….పేదవారి ఆకలి తీర్చడానికి రాష్ట్ర ముఖ్యమంత్రి నారాచంద్రబాబునాయుడు ఎన్నికలలో ఇచ్చిన మాట ప్రకారం తిరిగి అన్నా క్యాంటీన్లు ప్రారంభించడం జరిగిందన్నారు.
గతంలో అన్న క్యాంటీన్లకు ఎంతో ప్రాముఖ్యత ఉండేదని అలాంటి అన్న క్యాంటీన్లను గత ప్రభుత్వం తీసివేయడం జరిగిందన్నారు. తిరిగి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే అన్న క్యాంటీన్ ప్రారంభించి పేదలు, కూలీల కడుపు నింపడం చాలా సంతోషంగా ఉందన్నారు.
ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తొలి విడతలో 100 క్యాంటీన్లను ప్రారంభించడం జరిగిందని రెండో విడతలో రాష్ట్రవ్యాప్తంగా 75 అన్న క్యాంటీన్లను ప్రారంభించడం జరుగుతుందన్నారు. ఈ క్యాంటీన్లలో రూ.5కే ఉదయం ఇడ్లీ, పూరి, ఉప్మా, పొంగల్, చట్నీ, సాంబార్, లంచ్- డిన్నర్‌లో అన్నం, కూర, పప్పు, సాంబార్, పెరుగు, పచ్చడి ఇస్తారన్నారు. దినసరి కూలీలు, పరిశ్రమలలో పనిచే వారికి అనుగుణంగా రూ.5 లకే రుచికరమైన బోజనం పెట్టడం ప్రతి ఒక్కరు గర్వించదగ్గ విషయమహాన్నారు. ప్రతి క్యాంటీన్ వద్ద పూటకి 400 మందికి, రోజుకి 1200 మందికి టిఫిన్, మద్యాహ్నం మరియు రాత్రి పూట భోజనం ఉంటుందన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేద ప్రజలు ఎవరు ఆకలితో పస్తులు ఉండకూడదనే ముఖ్య ఉద్దేశంతో తిరిగి అన్న క్యాంటీన్లను ప్రారంభించడం జరిగిందని దీంతో ప్రతి పేదవాడు మూడు పూటలా భోజనం చేసి సుఖ సంతోషాలతో జీవిస్తారన్నారు. ఇకనుంచి రాష్ట్రంలో ఎక్కడ కూడా ఆకలి కేకలనేటివి ఉండవన్నారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ ఆదర్శ్ రాజేంద్రన్, మున్సిపల్ కమిషనర్, ప్రజా ప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు.

Check Also

ఎక్సైజ్ శాఖపై ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్ష

-గీత కులాలకు 10 శాతం మద్యం షాపుల కేటాయింపుపై నిర్ణయం -340 షాపులు ఇచ్చేందుకు వారం రోజుల్లో నోటిఫికేషన్ -రిటైల్ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *