-విజయవాడలో జూలై 10న మొబైల్ వ్యాన్లు ప్రారంభం…
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
వినియోగదారుల హక్కులపై ప్రజల్లో అవగాహన కల్పించే కార్యక్రమాలు చేపట్టిన ఆస్రా ప్రతినిధులను మైనారిటీల సంక్షేమ శాఖ ప్రత్యేక కార్యదర్శి ఏ.యండి. ఇంతియాజ్ అభినందించారు. బుధవారం న్యాయవాదుల అసోసియేషన్ ఫర్ సోషల్ రెస్పాన్సులిటీ అండ్ అవేర్ నెస్ (ఆస్రా) ఏపి మహిళా విభాగం ప్రసిడెంట్ కరంబీర్ కౌర్ మైనారిటీ సంక్షేమ శాఖ ప్రత్యేక కార్యదర్శి ఏ.యండి. ఇంతియాజ్ కు పుష్పగుచ్చం అందించి ఆస్రా నిర్వహించే కార్యకలాపాలను వివరించారు. సంబంధిత బ్రోచర్లను ఏ.యండి. ఇంతియాజ్ విడుదల చేశారు. ఈ సందర్భంగా కరంబీర్ కౌర్ మాట్లాడుతూ ఆస్రా ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణా, కర్ణాటక, హర్యానా, ఢిల్లీ, తమిళనాడు, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాలలో పనిచేస్తున్నదన్నారు. వినియోగదారుల హక్కుల గురించి సాధారణ ప్రజలకు అవగాహన కల్పించే కార్యక్రమాలు నిర్వహించబడతాయన్నారు. న్యాయపరమైన చర్యలను సరళీకృతం చేసేందుకు అవగాహనను విస్తరించడానికి వినియోగదారులకు మద్దతుగా జూలై 10వ తేదీన విజయవాడలో మొబైల్ వ్యాన్లు ప్రారంభించనున్నట్లు ఆమె వివరించారు. వినియోగదారుల హక్కుల గురించి ప్రజల్లో అవగాహన కలిగించే కార్యకలాపాలకు తమ మద్ధతు ఉంటుందని మైనారిటీ సంక్షేమ శాఖ ప్రత్యేక కార్యదర్శి ఏ.యండి. ఇంతియాజ్ అన్నారు. ఇందుకు సంబంధించిన కార్యక్రమాల్లో తాము పాల్గొనడానికి ఆయన సమ్మతిని వ్యక్తం చేశారు.