పెడన, నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట్ర రవాణా, సమాచార శాఖ మంత్రి పేర్ని వెంకట్రామయ్య (నాని), రాష్ట్ర పౌర సరఫరాలశాఖ మంత్రి కొడాలి శ్రీ వెంకటేశ్వరరావు (నాని), పెడన శాసన సభ్యులు జోగి రమేష్, జిల్లా కలెక్టర్ జె.నివాస్, జాయింట్ కలెక్టర్ డా. కె. మాధవీలతతో కలసి గురువారం పెడన మార్కెట్ యార్డు ఆవరణలో 66.50 లక్షల వ్యయంతో నూతనంగా నిర్మించిన డా. వైఎస్ఆర్ అగ్రిటెస్టింగ్ ల్యాబ్ ను ప్రారంభించింది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో కృష్ణాజిల్లాలో 70 డా. వైఎస్ఆర్ యంత్ర సేవ కేంద్రాలకు చెందిన 354 మంది రైతులకు 97 లక్షల రూ.లు సబ్సిడి మొత్తాన్ని చెక్కు పంపిణీ చేశారు. వ్యవసాయశాఖ అనుబంధ శాఖలు అమలు చేస్తున్న కార్యక్రమాలపట్ల రైతులకు అవగాహన కల్గించేందుకు ముద్రించిన పోస్టర్లను విడుదల చేశారు.
ఉత్తమ రైతులకు పురస్కారాలు:
డా. వైఎస్ఆర్ జయంతిని పురస్కరించుకుని రైతు దినోత్సవం సందర్భంగా ఉత్తమ రైతులకు పురస్కారాలు అందజేశారు. జిల్లా స్థాయిలో ఉత్తమ రైతు పెడన మండలం పెనుమల్లి గ్రామానికి చెందిన గరికపాటి వెంకటరామానాయుడుకు శాలువతో సత్కరించి ప్రశంసా పత్రం అందజేశారు. మండల స్థాయిలో ఉత్తమ రైతులు బంటుమిల్లి మండలం పెందూర్రు గ్రామానికి చెందిన చిటికినేని భాస్కరరావు, గూడూరు మండలం మల్లవోలు గ్రామానికి చెందిన ముచ్చు వెంకట నారాయణ, కృత్తి వెన్ను మండలం నీలిపూడి గ్రామానికి చెందిన పుప్పాల శ్రీనివాసరావులకు
మత్స్యశాఖ ద్వారా ఉత్తమ ఆక్వా రైతులు పొన్నమండ ఆంజనేయులు, జల్లా భూపతి, యలమర్తి సురేష్, పట్టా విజయకృష్ణ, మేక రవీంద్రబాబులను సత్కరించి ప్రశంసా పత్రాలు అందజేశారు. ఉత్తమ పశుపోషక పురస్కారాలు వల్లభ నేని భాను ప్రకాష్ కు 25 వేల నగదు పురస్కారం, సాలపాటి లక్ష్మణరావుకు 5 వేలు, గొరిపర్తి కృష్ణ మూర్తికి 5 వేలు, నాగుల శ్రీరామమూర్తికి 5 వేలు, కేతినేని వెంకటేశ్వరరావుకు 5 వేలు, తూమాటి వంశీకృష్ణకు 5 వేల చొప్పున నగదు పురస్కారాలు అందజేశారు.
ఈ సందర్భంగా ఈ సమావేశంలో మంత్రి పేర్ని మాట్లాడుతూ దివంగత ముఖ్యమంత్రి వైఎస్ఆర్ జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ ప్రతి తెలుగువాని గుండెల్లో నిలిచిన మహానీయుడని రైతులకు, రాజకీయ నాయకులకు స్పూర్తి ప్రదాత అని కొనియాడారు. తండ్రి స్పూర్తితో ముఖ్యమంత్రి జగన్ వ్యవసాయం కోసం ఎన్నో అడుగులు వేస్తూ తండ్రిని మించిన తనయుడుగా పరిపాలన చేస్తున్నారన్నారు. రైతులకు మట్టి నమూనాల దగ్గర నుంచి ఎరువులు, విత్తనాలు, పురుగుమందులు అందిస్తు రైతు గ్రూపులను ఏర్పాటు చేస్తూ వ్యవసాయానికి అండగా నిలుస్తున్నారని అన్నారు. 2014 నుండి 2019 వరకు ధాన్యం కొనే దిక్కులేదని, కొంటే డబ్బులు పడక రైతులు ఇబ్బందులు పడేవారు దీనిని దృష్టిలో ఉంచుకుని మధ్యదళారుల ప్రమేయం లేకుండా రైతు బరోసా కేంద్రాలు ఏర్పాటు చేసి రైతులకు అవసరమైన సేవలు అందిస్తున్నారని అన్నారు. వేలకోట్ల రూ.లతో ఆర్ బికెలు, సచివాలయాలు, హెల్త్ సెంటర్లు, టెస్టింగ్ ల్యా బ్లు నిర్మిస్తున్నారన్నారు. రాష్ట్రంలో 31 లక్షల మంది నిరు పేదలకు 10 వేల కోట్లతో 6 వేల ఎకరాలు కొని ఇళ్ల స్థలాలు పంపిణితో పాటు 10 వేల వేల కోట్లతో స్థలాలు మెరకచేయడం, 34 వేల కోట్లతో రోడ్లు, కరెంటు, త్రాగునీటి సౌకర్యం కల్పిస్తున్నారని అన్నారు. ఇళ్ల నిర్మాణానికి ఒక్కో ఇంటికి 1.80 లక్షల రూ.లు ఆర్ధిక సహయం అందిస్తూ 15.60 లక్షల మందికి ఈ ఏడాది ఇళ్లు మంజూరు చేశారని, వచ్చే ఏడాది మరో 15 లక్షల మందికి మంజూరు చేస్తారన్నారు.
మంత్రి కొడాలి శ్రీ వెంకటేశ్వరరావు (నాని) మాట్లాడుతూ స్వర్గీయ వైఎస్ఆర్ ముఖ్యమంత్రిగా జలయజ్ఞం చేపట్టి అనేక ప్రాజెక్టులతో పాటు పులిచింతల నిర్మించారని, పోలవరంకు నాంది పలికారని, ఆయన జయంతి నాడు రైతు దినోత్సవం సందర్భంగా రాష్ట్ర థి వ్యాప్తంగా అత్యలు ఆ బాలు ఏర్పాటు చేశారని, రైతులకు అన్ని విధాల సేవలు అందించిన గొప్ప మనిషి అని కొనియాడారు.
ఈ సభకు అధ్యక్షత వహించిన పెడన శాసన సభ్యులు జోగి రమేష్ మాట్లాడుతూ స్వర్గీయ వైఎస్ఆర్ పాదయాత్రలో రైతుల కష్టాలు చూసి చలించి రైతును రారాజుగా చేయడం కోసం రైతు పక్షపాతిగా ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు అమలు చేశారని, ఫీజు రీయంబమెంట్ ఆరోగ్యశ్రీ వంటి సంక్షేమ కార్యక్రమాలు అమలు చేశారన్నారు. పెడనలో ఆక్వాపుడ్ ప్రాసెసింగ్ యూనిట్ ఏర్పాటు చేయించాలని మంత్రులకు,
జిల్లా కలెక్టరుకు విన్నవించారు. జిల్లా కలెక్టర్ జె. నివాస్ మాట్లాడుతూ గతంలో విత్తనాలు, ఎరువులు కోసం రైతులు పెద్ద పెద్ద క్యూలు కట్టేవారని, గత రెండేళ్లుగా ప్రశాంత వాతావరణంలో రాష్ట్రంలో రైతులకు ఎరువులు, విత్తనాలు పంపిణీ ఘనత ముఖ్యమంత్రికే దక్కుతుందన్నారు. రైతుబరోసా కేంద్రాల్లో రైతులు తమ పేర్లు నమోదు చేసుకోవడం ద్వారా గ్రామంలోనే వారికి అవసరమైన ఎరువులు, విత్తనాలు అందజేయడం జరుగుతుందని అంతేకాకుండా రైతులకు సూచనలు, సలహాలు ఇచ్చుటకు వ్యవసాయ సలహబోర్డు కమిటీలు ప్రభుత్వం ఏర్పాటు చేసిందన్నారు. రైతుల సమస్యలు అప్పటికప్పుడే పరిష్కరించే దిశగా వ్యవసాయ అనుబంధ శాఖల సమన్వయంతో మండల నియోజక వర్గ స్థాయిలో రైతు స్పందన కార్యక్రమం త్వరలో ప్రభుత్వం చేపట్టనున్నదన్నారు.
రైతులు ఎవ్వరు మోసపోకుండా కలీ విత్తనాల ఎరువుల బాధ తప్పించడానికి ప్రతి నియోజక వర్గంలో అగ్రిల్యాలు ప్రభుత్వం ఏర్పాటు చేసిందన్నారు. వ్యవసాయ పరిశోధన కేంద్రం సైంటిస్ట్ డా. గిరిజారాణి ఈ సమావేశంలో రైతులకు మెలైన విత్తన రకాలు సాగు పరిస్థితులు గురించి వివరించారు. ప్రకృతి వ్యవసాయ విభాగం జిల్లా ప్రాజెక్టు అధికారి విజయకుమారి ప్రకృతి వ్యవసాయం వల్ల కలిగే లాభాలు గురించి వివరించారు. తొలుత మార్కెట్ యార్డు ఆవరణలో మొక్కలు నాటి, వ్యవసాయశాఖ అనుబంధ శాఖలు ఏర్పాటు చేసిన స్టాను మంత్రులు, ఎమ్మెల్యే, జిల్లా కలెక్టర్ , జాయింట్ కలెక్టర్ పరిశీలించారు. ఈ కార్యక్రమంలో పెడన మార్కెట్ యార్డు చైర్మన్ గరికపాటి చారుమతి, జిల్లా వ్యవసాయ సలహబోర్డు కమిటీ ఛైర్మన్ జన్ను రాఘవరావు బందరు ఆర్ డివో ఎస్ఎస్ కె. ఖాజావలి, మున్సిపల్ కమీషనర్ ఎం. అంజయ్య, వ్యవసాయశాఖ జెడి మోహనరావు, పశుసంవర్ధకశాఖ జెడి కె. విద్యసాగర్, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.