Breaking News

మనసున్న ముఖ్యమంత్రి దివంగత నేత డాక్టర్ వైస్సార్ : మంత్రి పేర్ని నాని

మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త :
ఈ దేశం ఎంతో మంది ప్రధానమంత్రులు, ముఖ్యమంత్రులను చూసిందని, కానీ డాక్టర్ వై ఎస్ రాజశేఖర్ రెడ్డి లాంటి మంచి మనసున్న ముఖ్యమంత్రిని ఇప్పటివరకు చూడలేదని రాష్ట్ర రవాణా, సమాచార పౌర సంబంధాల శాఖల మంత్రి పేర్ని వెంకట్రామయ్య ( నాని ) అభిప్రాయపడ్డారు. గురువారం  ఆయన తన కార్యాలయం వద్ద దివంగత నేత, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ వై.ఎస్. రాజశేఖర్ రెడ్డి 72 వ జయంతి సందర్భంగా రాజశేఖర్ రెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం ఆయన ప్రజలతో మాట్లాడుతూ, ప్రజల సంక్షేమం కోసం దివంగత ప్రియతమ నేత డాక్టర్ వై ఎస్ రాజశేఖరరెడ్డి నాడు రెండు అడుగులు ముందుకువేస్తే నేడు అయన తనయుడు వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి పది అడుగులు ముందుకు వేస్తున్నారని ప్రశంసించారు. ఆ మహానేత ను అందరూ ప్రేరణగా తీసుకోవాలని కోరారు. రావిచెట్టు మర్రిచెట్టు మాదిరిగా ఎంతో సుదీర్ఘ కాలం జీవించామనినేది కాకుండా డాక్టర్ వైఎస్సార్ మాదిరిగా ఐదేళ్లు పాటు ముఖ్యమంత్రిగా జీవించిన కాలంలో జనరంజకమైన పరిపాలనతో మెప్పించారన్నారు. ఆయన తన సమర్ధమైన చల్లని పరిపాలనతో చరిత్రలో తనకంటూ ఒక మహోన్నత స్థానం ఏర్పరచుకొన్నారనున్నారు.
ఆర్ డబ్ల్యు ఎస్ ఏ ఇ సుగుణ మంత్రి పేర్ని నాని సూచన కొరకు వచ్చారు. మచిలీపట్నం మండలంలోని చిన్నాపురం గ్రామ ప్రాధమిక ఆరోగ్య కేంద్రం నుంచి కమ్మవారిచెరువు వరకు గ్రామీణ నీటి సరఫరా పథకం 2. 4 కోట్ల రూపాయల నిధులతో నూతన పైప్ లైన్ నిర్మాణం 6 కిలోమీటర్ల వరకు పూర్తయిందని, ఇప్పటివరకు పాత పైప్ లైన్ ద్వారా తాగునీరు ప్రజలకు అందిస్తున్నామని ఇప్పుడు కొత్త లైన్ కలిపివేస్తామని రోడ్డు వరకు కల్వర్టులు తొలగించి రోడ్డు నిర్మించుకోవడానికి వీలుగా పాత పైప్ లైన్ తొలగించి నూతన 6 కిలోమీటర్ల లైన్ అనుసంధానం చేయాల్సి ఉందని ఆ పని పూర్తి చేసేందుకు రెండు మూడురోజుల సమయం పడుతుందని మంత్రిక దృష్టికి ఆమె తెచ్చారు. ఈ విషయమై స్పందించిన ఆయన మాట్లాడుతూ, రోజు విడిచి రోజు ఆ ప్రాంతాలలో తాగునీరు ఇస్తారు కనుక నీటి సరఫరా నిలిచిపోయి ప్రజలు తాగునీటికి ఇబ్బంది పడకుండా ఆయా ప్రాంతాలలో ముందస్తు సమాచారం ఇచ్చిన తర్వాత మాత్రమే మీ పని ప్రారంభించుకోవాలని మంత్రి సూచించారు.

Check Also

వరద బాధితులకు విరాళాల వెల్లువ

-సీఎం చంద్రబాబును కలిసి చెక్కులు అందించిన దాతలు అమ‌రావ‌తి, నేటి పత్రిక ప్రజావార్త : అనూహ్య వరదలతో నిర్వాసితులైన బాధితులకు …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *