మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త :
కృష్ణా జిల్లా లో పర్యటనలో భాగంగా మచిలీపట్టణం చేరుకున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తన పర్యటనలో స్వల్ప మార్పు చేసుకున్నారు. స్వచ్ఛతా హి సేవా కార్యక్రమంలో రాష్ట్ర గనులు, ఆబ్కారీ శాఖా మంత్రి కొల్లు రవీంద్ర, ఎంపీ వల్లభనేని బాలసౌరి చేసిన విజ్ఞప్తి మేరకు మచిలీపట్టణం పోర్ట్ ను అధికారులతో కలిసి బుధవారం ముఖ్యమంత్రి పరిశీలించారు. అధికారులు, పోర్ట్ ఇంజినీర్లతో కలిసి బందరు పోర్ట్ మాస్టర్ ప్లాన్ పరిశీలించి, క్షేత్రస్థాయిలో అక్కడి పరిస్థితులను పరిశీలించి వాటి వివరాలను ముఖ్యమంత్రి అడిగి తెలుసుకున్నారు. ఎక్కడ పనులు ఏ మేరకు పూర్తి అయ్యాయి, ఇంకా చేపట్టవలసిన పనులను గురించి అధికారులను ముఖ్యమంత్రి అడిగి తెలుసుకున్నారు.
Tags machilipatnam
Check Also
బడ్జెట్ భేష్ : మంత్రి సవిత
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ లోక్ సభలో ప్రవేశపెట్టిన ఆర్థిక బడ్జెట్ …