Breaking News

కడియంనర్సరీ ప్రాంతాలలో కెఫ్టేరియా , ఫ్లవర్ స్థాల్స్

-మూడు ప్రాంతాలలో ఫుట్ పాత్ బ్రిడ్జి, జీప్ రైడర్స్ ఏర్పాటు
-రెవెన్యు, పర్యటక, స్ధానిక అసోసియేషన్ ప్రతినిధులతో క్షేత్ర స్థాయిలో పరిశీలన
-అధికారులు సిద్దంచేసిన ప్రతిపాదనలపై సమీక్ష
-స్వాగత ద్వారం, అర్చరీలు ఏర్పాటుకి ప్రతిపాదన
-కలెక్టర్ పి ప్రశాంతి

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
వెమగిరి నుంచి పొట్టిలంక వరకూ ఉన్న కెనాల్ బండ్లు ప్రాంతాన్ని ప్లాంట్స్, ఫుడ్ అనుబంధ ఆహార పదార్థాలు, కాఫ్టేరియా లు ఏర్పాటు చేసే క్రమంలో క్షేత్ర స్థాయిలో పర్యటించి నివేదిక అందచేయాలని ఆదేశించడం జరిగిందని జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి తెలిపారు.

బుధవారం సాయంత్రం కలక్టరేట్ లో కడియం, వేమగిరీ లకి చెందిన స్థానిక ప్రజాప్రతినిధులు, నర్సరీ అసోసియేషన్ ప్రతినిధులు,అధికారులతో కలిసి కలెక్టర్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ పి ప్రశాంతి మాట్లాడుతూ , ఏకో టూరిజం అభివృద్ది కోసం అధికారులు ప్రాథమికంగా గుర్తించిన వివరాలతో కూడిన పి పి టి ఇవ్వడం జరిగిందన్నారు. ఇందులో భాగంగా పర్యావరణానికి ఎటువంటి ఆటంకం లేకుండా జంగిల్ క్లియరెన్స్ చేపట్టి షాపులు ఏర్పాటు, కేఫ్టేరియా నిర్మాణాలు, స్వాగత ద్వారం, ముఖ ద్వారం తదితర అంశాలతో కూడి ఎక్కడెక్కడ ఏర్పాట్లు చెయ్యాలో సూచిస్తూ సమగ్ర వివరాలు అందచేయాడం జరిగిందన్నారు. ఆమేరకు ఎవరి ఎక్కడ షాపులు కేటాయించాలో నిర్ణయం తీసుకోవడం జరుగుతుందని కలెక్టర్ తెలిపారు. ఇదే క్రమంలో నర్సరీలు ఉన్న ప్రాంతానికి అనుసంధానం చేస్తూ మూడు ప్రదేశాల్లో ఫుట్ వే బ్రిడ్జి నిర్మాణం కోసం ప్రతిపాదించడం జరిగిందన్నారు. ఆమేరకు సంబంధిత నర్శరీ యాజమాన్యం అంగీకారం వ్యక్తం చెయ్యాల్సి ఉంటుందన్నారు. కలిదిండి నరసరీ లలో రెండు చోట్ల జీప్ రైడర్స్ ఏర్పాటు కోసం ప్రతిపాదన చెయ్యడం జరిగిందని, వాటికి ఆయా నర్సరీ అసోసియేషన్ లు చర్చించుకుని అంగీకారం వ్యక్తం చెయ్యాల్సి ఉంటుందన్నారు.

ఈ సమావేశంలో టూరిజం ప్రాంతీయ సంచాలకులు వి. స్వామి నాయుడు, కడియం ఎంపిపి వెలుగుబంటి వెంకట సత్య ప్రసాద్, జిల్లా టూరిజం అధికారి పి.వెంకటాచలం, ఏపిఎమ్ఐపి పిడి ఏ.దుర్గేష్, కడియం తహసీల్దర్ పోశయ్య, ఎంపిడిఓ రమేష్ , అసోసియేషన్ ప్రతినిధులు మార్గం సత్యనారాయణ ఈ గణపతి గట్టి నరసయ్య, ఎం పాల్ రాజు, తదితరులు పాల్గొన్నారు.

Check Also

జిల్లాలోని రిజర్వాయర్ పనులను వేగవంతం చేయండి: జిల్లా కలెక్టర్ డా .ఎస్ వెంకటేశ్వర్

తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలోని దీర్ఘకాలంగా పూర్తికాని రిజర్వాయర్ పనులను వేగవంతం చేసేలా ప్రత్యేక దృష్టి చేపట్టాలని …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *