Breaking News

ఆన్లైన్.. ఆఫ్ లైన్ కోసం ప్రత్యేకంగా సిబ్బందిని నియమించాలి

-సీసీ కెమెరాలు ఏర్పాటు కోసం డిమాండ్ ను అనుసరించి 24 గంటల్లో విద్యుత్ శాఖ పోల్స్ ఏర్పాట్లు పూర్తి చెయ్యాలి
-కలెక్టర్ పి ప్రశాంతి

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
ఇసుక ను వినియోగదారులకి ఆఫ్ లైన్ ఈరోజు నుంచి ప్రారంభం చెయ్యడం జరిగిందని ఆమేరకు అత్యంత ప్రాధాన్యత కలిగి విధులను నిర్వర్తించాలని జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి పేర్కొన్నారు.

బుధవారం ఉదయం జాయింట్ కలెక్టర్ ఎస్ చిన్న రాముడు తో కలిసి క్షేత్ర స్థాయి అధికారులు, సిబ్బందితో టెలి కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ పి ప్రశాంతి మాట్లాడుతూ, ఆన్లైన్ కోసం, ఆఫ్ లైన్ కోసం ప్రత్యేకంగా సిబ్బందిని నియమించి, ఎటువంటి ఆటంకం కలగకుండా ఇసుక సరఫరా విధానం అత్యంత పారదర్శకంగా నిర్వహించాలన్నారు. ప్రతి పాయింట్ వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చెయ్యాలన్నారు. రీచ్ ల వద్ద విధులను నిర్వహించే వారికి గుర్తింపు కార్డు జారీ చేసినట్లు, వారినే అనుమతించ వలసి ఉంటుందన్నారు. ఇప్పటికే ఆన్లైన్ కోసం సిబ్బందికి శిక్షణ ఇవ్వడం జరిగింది అన్నారు. అదే విధంగా ఆఫ్ లైన్ లో విధులకు హాజరైయ్యే సిబ్బందికి శిక్షణ కార్యక్రమం చేపట్టాలని పేర్కొన్నారు.

రీచ్ వైస్ పోయింట్ పర్సన్ శిక్షణా విషయములో మార్గదర్శకాలు పై అవగాహన కల్పించడం జరిగిందని అన్నారు. ఇసుక రవాణా సదుపాయం కోసం ప్రభుత్వపరంగా ఎంప్యానల్ అయన, అదే విధంగా వినియోగదారుని ఇచ్చికాన్ని అనుసరించి స్వంతంగా వాహనం ఏర్పాటు చేసుకునే సౌలభ్యం ఉందన్నారు. ట్రాన్స్పోర్ట్ల్ కోసం బుక్ చేసుకున్న ఫోన్ నెంబర్ కి ఓటిపి మెసేజ్ (సందేశం) వొస్తుందని, వాటిని నిర్ధారణ చేసుకున్న తదుపరి లోడింగ్ పాయింట్ వద్ద కు అనుమతించాలన్నారు. సీసీ కెమెరాలు ఏర్పాటు, విధుల్లో భాగంగా ఉండే సిబ్బందికి శిక్షణ కార్యక్రమం చేపట్టాలని నిర్ణయించారు. ఆఫ్ లైన్, ఆన్లైన్ కోసం ప్రత్యేక సిబ్బందిని నియమించినట్లు తెలిపారు. మానవ వనరులను సమయోచితంగా నియమించుకుని అందుబాటులో ఉంచాలని స్పష్టం చేశారు. మస్టర్ రోల్ తప్పనిసరిగా నిర్వహిస్తూ , లేబర్ హజరు , పనితనం పర్యవేక్షణ కోసం చొరవ తీసుకోవాలన్నారు. ప్రైవేటు సెక్యూరిటీ ఆధ్వర్యంలో ఇసుక రిచ్ ల వద్ద స్లాట్ కేటాయింపు ను అనుసరించి క్రమబద్ధీకరణ చర్యలు తీసుకోవాలని, వాటిపై పోలీసుల పర్యవేక్షణా చెయ్యడం తప్పని సరి అన్నారు. ఈరోజు విద్యుత్ సరఫరా విషయంలో ఎలక్ట్రికల్ పోల్స్ సిద్ధం చేస్తున్నట్లు అర్డివోలు తెలిపారు. సీసీ కెమెరాలు ఏర్పాటు కు   సంబంధించిన వివరాలు పై కలెక్టర్ రీచ్ వారీగా సమీక్ష నిర్వహించారు. పోల్స్ ఏర్పాట్లు చెయ్యడం కోసం అంచనాలకు అనుగుణంగా చెల్లింపులు జరిపిన 24 గంటల్లో పోల్స్ ఏర్పాట్లు చేయాలన్నారు. విద్యుత్ శాఖ సూపరింటెండెంట్ ఇంజనీర్ ఆమేరకు ముందస్తుగా అంచనాలకి అనుగుణంగా మెటీరియల్ డంపింగ్ చెయ్యాల్సి ఉందన్నారు. పోల్స్ ను 24 గంటల్లో ఏర్పాటు చెయ్యాలని ఆదేశించారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

“తాలీమ్-ఎ-హునర్ (వక్ఫ్ ఎడ్యుకేషన్ మిషన్)” కార్యక్రమం

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఎన్‌టీఆర్ జిల్లా మైనారిటీ సంక్షేమ అధికారి తెలియజేయునదేమనగా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వక్ఫ్ బోర్డు …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *