Breaking News

ఆంధ్రప్రదేశ్ ఎంతో నిబ‌ద్ధ‌త‌తో అమ‌రావ‌తి డ్రోన్ సమ్మిట్-2024 నిర్వ‌హిస్తోంది…

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
జ్యోతిప్ర‌జ్వ‌ల‌న‌తో అమ‌రావ‌తి డ్రోన్ సమ్మిట్‌ను ప్రారంభించిన అనంత‌రం వ‌క్త‌లు మాట్లాడారు. ర‌హ‌దారులు, భ‌వ‌నాలు; మౌలిక వ‌స‌తులు, పెట్టుబ‌డుల శాఖ మంత్రి బీసీ జ‌నార్ధ‌న్‌రెడ్డి అమ‌రావ‌తి డ్రోన్ స‌ద‌స్సులో మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ ఎంతో నిబ‌ద్ధ‌త‌తో అమ‌రావ‌తి డ్రోన్ సమ్మిట్-2024 నిర్వ‌హిస్తోంద‌ని.. ఇది నాయకుడు పట్టుదలకు నిదర్శన‌మ‌ని అన్నారు. డ్రోన్ సాంకేతికతకు, డ్రోన్ స్టార్ట‌ప్‌ల‌కు రాష్ట్రంలో ఎన్నో అవకాశాలు ఉన్నాయని, అంతేకాకుండా 972 కిలోమీటర్ల విశాలమైన స‌ముద్ర‌తీరం ఉంద‌న్నారు. డ్రోన్ సాంకేతిక‌త‌ను ప్రోత్స‌హించేందుకు ప్ర‌భుత్వం ఎంతో స‌ర‌ళీకృత విధానాల‌ను తీసుకొస్తోంద‌న్నారు. పెట్టుబ‌డుల‌ను ప్రోత్స‌హించి, కంపెనీల ఏర్పాటుకు అవ‌కాశాలు క‌ల్పిస్తున్న‌ట్లు తెలిపారు.

రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీర‌బ్ కుమార్ ప్రసాద్ మాట్లాడుతూ భవిష్యత్తు టెక్నాలజీ డ్రోన్స్‌దేన‌ని.. రియల్ టైం గవర్నెన్స్ లో భూముల సర్వే తదితర రంగాల్లో ఇప్ప‌టికే డ్రోన్ల‌ను ఉప‌యోగించ‌డం జ‌రుగుతోంద‌న్నారు. రాష్ట్రంలో డ్రోన్ కార్య‌క‌లాపాల‌ను ప్రోత్స‌హించేందుకు క‌ళాశాల‌లు, విశ్వ‌విద్యాల‌యాల్లో యువ‌త‌ను భాగ‌స్వామ్యం చేస్తున్నామ‌న్నారు.

Check Also

దేశ డ్రోన్ రాజ‌ధానిగా ఏపీని తీర్చిదిద్దుతాం

-ఓర్వకల్లు ఇండస్ట్రియల్ పార్కులో డ్రోన్ హబ్ కోసం 300 ఎకరాలు కేటాయిస్తాం. -రాష్ట్రంలో 35 వేల మంది డ్రోన్ పైలట్లకు …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *