-అమ్మవారిని దర్శించుకున్న కేంద్రమంత్రి, ఎంపీలు, ఎమ్మెల్యేలు
-ఆలయ మర్యాదలతో ఈవో ఘన స్వాగతం
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ఇంద్రకీలాద్రి పై అమ్మవారి ఆశీస్సులు, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కృషి వల్లే డ్రోన్ హాక్ థాన్ ఐదు గిన్నిస్ రికార్డులు నమోదు చేసుకుందని విజయవాడ ఎంపి కేశినేని శివనాథ్ అన్నారు.
ఇంద్రకీలాద్రి కొలువుదీరిన కనకదుర్గ అమ్మవారిని కేంద్ర పౌరవిమానాయన శాఖ మంత్రి కింజరపు రామ్మోహన్ నాయుడు, విజయవాడ ఎంపి కేశినేని శివనాథ్ , అనకాపల్లి ఎంపీ సీఎం రమేష్ , మాడుగుల ఎమ్మెల్యే బండారు సత్యనారాయణమూర్తి, యలమంచిలి ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్ బుధవారం దర్శించుకున్నారు. ఆలయ మర్యాదలతో ప్రజాప్రతినిధులందరికీ ఆలయ ఈవో కె.ఎస్.రామారావు ఘన స్వాగతం పలికారు. దర్శనం అనంతరం ఆశీర్వచన మండపంలో వేదపండితులు వేదమంత్రాలతో ఆశీర్వదించి వారికి తీర్థప్రసాదాలు అందజేయగా, ఆలయ ఈవో అమ్మవారి చిత్రపటాలు బహుకరించారు. అమ్మవారి అనుగ్రహం, సీఎం చంద్రబాబు సంకల్పం వల్లే దేశంలో మొదటిసారి ఇంత పెద్ద స్థాయిలో డ్రోన్ సమ్మిట్ -2024 అమరావతి రాజధాని లో ఏర్పాటు చేయటం జరిగిందని కేంద్ర పౌరవిమానాయన శాఖ మంత్రి కింజరపు రామ్మోహన్ నాయుడు తెలిపారు. రాష్ట్ర ప్రజలు సుభిక్షంగా, సుఖ సంతోషాలతో జీవించేలా అమ్మవారి కరుణా కటాక్షాలు వుండేలని వేడుకున్నట్లు ప్రజాప్రతినిధులు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో స్థానిక టిడిపి, జనసేన, బిజెపి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.