-వెస్ట్ లో టిడిపి విస్తృత స్థాయి సమావేశం
-గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఓటు నమోదు పై అవగాహన
-రికార్డ్ స్థాయిలో పార్టీ సభ్యత్వ నమోదు చేయించాలని పిలుపు
-పశ్చిమంలో బలమైన శక్తిగా టిడిపి
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
పశ్చిమ నియోజకవర్గం టిడిపి ఒక బలమైన శక్తిగా నిలబడింది. ఎంపి తనకి 57 వేల మెజార్టీ, ఎమ్మెల్యే సుజనా చౌదరికి 47వేల మెజార్టీ వచ్చిందంటే టిడిపి నాయకులు, కార్యకర్తల కృషి ఎంతగానో వుంది. అందుకే కార్యకర్తలే ఆస్తి…వారి శ్రేయస్సే ముఖ్యమని విజయవాడ ఎంపి కేశినేని శివనాథ్ ప్రకటించారు. బుధవారం విజయవాడ పశ్చిమనియోజకవర్గం చిట్టినగర్ ప్రాంతంలోని మిల్క్ ఫ్యాక్టరీ ఫంక్షన్ హాల్ లో టిడిపి పశ్చిమ నియోజకవర్గ విస్తృత స్థాయి సమావేశం జరిగింది. ఈ సమావేశంలో పార్టీ సభ్యత్వ నమోదు గురించి, ఉమ్మడి కృష్ణ -గుంటూరు జిల్లా ఎమ్మెల్సీ అభ్యర్ధి ఆలపాటి రాజేంద్రప్రసాద్ విజయాన్ని కాంక్షిస్తూ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల ఓటర్ల నమోదు ప్రక్రియపై అవగాహన కూడా టిడిపి నాయకులు, కార్యకర్తలకి కల్పించారు.
ఈ సమావేశానికి ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు నెట్టెం రఘురామ్ అధ్యక్షత వహించారు. సమావేశ ప్రారంభానికి ముందు ఎన్టీఆర్ విగ్రహానికి నాయకులందరూ నివాళులర్పించారు.ఈ సమావేశం అనంతరం టిడిపి పశ్చిమ నియోజకవర్గ నాయకులు ఎంపి కేశినేని శివనాథ్, పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి ఆలపాటి రాజేంద్రప్రసాద్ ను ఘనంగా సత్కరించారు.
ఈ సందర్భంగా ఎంపి కేశినేని శివనాథ్ మాట్లాడుతూ కృష్ణా-గుంటూరు జిల్లాల పట్టభద్రులు ఎన్డీయే కూటమి ఎమ్మెల్సీ అభ్యర్ధిగా బరిలోదిగుతున్న ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ కు అఖండ విజయం చేకూరుద్దామని, ఆ దిశగా టిడిపి నాయకులు, కార్యకర్తలు పనిచేయాలని ఎంపి కేశినేని శివనాథ్ పిలుపునిచ్చారు. విజయవాడ పశ్చిమ నియోజకవర్గం లో సభ్యత్వ నమోదు బాగా చేయించాలని క్లస్టర్ ఇన్ ఛార్జ్, బూత్ ఇంచార్జి లకు సూచనలు అందించారు. .
తనకి భారీ మెజార్టీ వచ్చేందుకు కృషి చేసిన టిడిపి నాయకులు, కార్యకర్తలకు దన్యవాదాలు తెలిపారు. చిన్నప్పటి నుంచి వెస్ట్ లో చూసిన నాయకులందరూ ఒకే వేదిక పై వుండటం చాలా సంతోషంగా వుందన్నారు. వరద, దసరా ఉత్సవాలు నేపథ్యంలో ఇటువంటి సమావేశం పెట్టుకోవటం కొంత జాప్యం జరిగిందన్నారు.
పార్టీ కోసం చాలా మంది కార్యకర్తలు బాగా కష్టపడుతున్నారు ..వారికీ పదవులు రావట్లేదనే ఆలోచన పెట్టుకోవద్దని…ముఖ్యమంత్రి చంద్రబాబు కష్టపడే నాయకులు, కార్యకర్తలకు న్యాయం చేస్తారన్నారు. పదవులు ఎవరికి వచ్చినా మిగిలిన వారు సమన్వయం పాటించాలన్నారు. భారీ గా సభ్యత్వ నమోదు చేయించి సీఎం చంద్రబాబు నాయుడు వద్దకు వెళ్లి నామినేటెడ్ పదవులు అడుగుదామన్నారు.
సీఎం చంద్రబాబు కూడా పార్టీ నాయకుల కంటే కార్యకర్తలే ముఖ్యమని వారే టిడిపి ఆస్తిని చెప్పటం జరిగింది…వారికి ఎలాంటి ఇబ్బందులు రాకుండా చూడాలని ఆదేశించారని తెలిపారు. మనమందరం చంద్రబాబు నాయుడు కి ఒక ఆస్తి అని పేర్కొన్నారు.
పశ్చిమ నియోజకవర్గంలో టిడిపి క్యాడర్ , కార్యకర్తల పరిస్థితి బాగోలేదు. వారిని ఆ పరిస్థితి నుంచి బయట పడేసేందుకు ప్రయత్నిస్తామని భరోసా కల్పించారు. త్వరలోనే ఎమ్.ఎస్.ఎమ్.ఈ ద్వారా చిన్న చిన్న వ్యాపారస్తులకు లోన్ ఇచ్చే విధంగా క్యాడర్ కి సాయపడే కార్యక్రమం చేపట్టబోతున్నట్లు తెలిపారు. తనని ఆదరించిన వెస్ట్ ను అభివృద్ది చేసేందుకు ముందు వుంటానన్నారు. తన రాజకీయ ప్రవేశానికి సాయపడిన మాజీ ఎమ్మెల్సీబుద్దా వెంకన్న, టిడిపి రాష్ట్ర అధికార ప్రతినిధి నాగుల్ మీరాకి కృతజ్ఞతలు తెలిపారు.
పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ తనని గ్రాడ్యుయేట్స్ అభ్యర్థిగా ప్రకటించినందుకు సీఎం చంద్రబాబు నాయుడు ధన్యవాదాలు తెలిపారు. 2024 అసెంబ్లీ ఎన్నికలు ఒకటి చారిత్రాత్మకమన్నారు. పట్టభద్రులను ఓట్ల కోసం ఎన్రోల్ చేయించే బాధ్యత కార్యకర్తలపైనే వుందని తెలిపారు. గత ఎన్నికల్లో కూటమి శ్రేణులు కషితో పనిచేసి రాష్ట్రానికి పట్టిన పీడను వదిలించారన్నారు. పదవులు లేకపోయినా పార్టీయే తమదని భావించి వెన్నుదన్నుగా నిలిస్తున్న టిడిపి శ్రేణులంతా కూడా ఎమ్మెల్సీ ఎన్నికల్లో తన గెలుపుకు కృషిచేసి మంచి మెజార్టీతో గెలిపించాలని కోరారు.
మాజీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న మాట్లాడుతూ ఎన్టీఆర్ జిల్లాలోని ఏడు నియోజకవర్గాల ప్రజల బాధలు చూసి, వారి కోసం ప్రజల్లో నుండి వచ్చిన నాయకుడు కేశినేని చిన్ని అంటూ కొనియాడారు. వారి ఆధ్వర్యంలో ఈ విస్తృత స్థాయి సమావేశం జరగటం చాలా ఆనందంగా వుందన్నారు. .. రాబోయే ఎమ్మెల్సి ఎన్నికలలో ఎంపీ చిన్ని ఆధ్వర్యంలో అందరం కలసి పని ఎమ్మెల్సీ అభ్యర్థి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ను గెలిపించాలని కోరారు.
మాజీ ఎమ్మెల్సీ జలీల్ ఖాన్, టిడిపి రాష్ట్ర కార్యనిర్వహక కార్యదర్శి ఎమ్.ఎస్. టిడిపి రాష్ట్ర అధికార ప్రతినిధి నాగుల్ మీరా మాట్లాడుతూ పశ్చిమంలో టిడిపి బలమైన శక్తిగా, టిడిపికి వెస్ట్ నియోజకవర్గం ఒక కంచుకోటగా మారిందన్నారు.
ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర వాణిజ్య విభాగ అధ్యక్షులు డూండి రాకేష్ టిడిపి రాష్ట్ర అధికార ప్రతినిధి సయ్యద్ రఫీ, రాష్ట్ర SC సెల్ సీనియర్ నాయకులు కామా దేవరాజు , రాష్ట్ర బీసీ సెల్ నాయకులు గుర్రం కొండ , పశ్చిమ నియోజకవర్గం ఎమ్మెల్సీ ఎన్నికల కోఆర్డినేటర్ శివశర్మ, నియోజకవర్గ తెలుగు యువత అధ్యక్షులు ఆర్ మాధవ్ , నియోజకవర్గ తెలుగు మహిళా అధ్యక్షురాలు సుఖాసి సరిత ,ఎన్టీఆర్ జిల్లా వాణిజ్య విభాగ అధ్యక్షులు సోలంకి రాజు, నియోజకవర్గ టిఎన్టియుసి అధ్యక్షులు హనుమంతరావు గారు, మహిళా నాయకులు బూదాల నంద కుమారి గారు, డివిజన్ అధ్యక్షులు, క్లస్టర్లు, యూనిట్ ఇన్చార్జులు మరియు స్థానిక తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News