గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త :
గుంటూరు నగరంలో వార్డ్ సచివాలయాల వారీగా నూతన స్వయం సహాయక గ్రూప్ లను ఏర్పాటుకు మెప్మా సిఎంఎం, సిఓలు చర్యలు తీసుకోవాలని నగర కమిషనర్ పులి శ్రీనివాసులు ఐఏఎస్ ఆదేశించారు. శనివారం నగరపాలక సంస్థ కౌన్సిల్ సమావేశ మందిరంలో మెప్మా(ఉపా సెల్), పరిపాలన, లీగల్ సెల్ విభాగాల సమీక్షా సమావేశం జరిగింది.
ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ గుంటూరు నగరంలో వార్డ్ సచివాలయాల వారీగా నూతనంగా స్వయం సహాయక గ్రూప్ లు ఏర్పాటు చేయడానికి మెప్మా సిబ్బంది ప్రత్యేక దృష్టి సారించాలని, ప్రతి శనివారం జరిగే సమీక్షా సమావేశంలో నూతన గ్రూప్ ల ఏర్పాటుపై ప్రత్యేక సమీక్షా చేస్తామని తెలిపారు. అలాగే నగరంలోని హిజ్రాలతో ప్రత్యేకంగా స్వయం సహాయక గ్రూప్ లను ఏర్పాటు చేయాలన్నారు. పిఎం స్వానిధిలో పెండింగ్ రుణాలు నవంబర్ 15లోపు లబ్దిదారులకు అందేలా బ్యాంకర్లతో సమన్వయం చేసుకోవాలన్నారు. పిఎం విశ్వకర్మకు అందిన దరఖాస్తులను వార్డ్ వెల్ఫేర్ కార్యదర్శులు క్షేత్ర స్థాయి పరిశీలన చేసి జిల్లా పరిశ్రమల శాఖకు అందించాలన్నారు. నైబర్ హుడ్ బిజినెస్ యూనిట్ (ఎన్.బి.యు.) సర్వే త్వరగా పూర్తి చేయాలని, హౌసింగ్ కి సంబందించి స్వయం సహాయక సభ్యులకు రూ.35 వేల రుణాన్ని త్వరగా మంజూరు చేయించాలన్నారు. ప్రతి నెల తూర్పు నియోజకవర్గంలో శ్రీ వెంకటేశ్వర విజ్ఞాన మందిరం, పశ్చిమ నియోజకవర్గంలో ఎన్టీర్ మున్సిపల్ స్టేడియంలో మెప్మా బజార్లు ఏర్పాటు చేయాలన్నారు. అనంతరం కోర్ట్ కేసులను విభాగాల వారీగా సమీక్షించి, కేసులు కన్టేమ్ట్ ల వరకు వెళ్లకుండా సకాలంలో కౌంటర్లు దాఖలు చేయాలన్నారు. కోర్ట్ తీర్పులను సత్వరం అమలు చేయాలని ఆదేశించారు.
సమావేశంలో అదనపు కమిషనర్ సిహెచ్.ఓబులేసు, డిప్యూటీ కమిషనర్లు డి.శ్రీనివాసరావు, సిహెచ్.శ్రీనివాస్, మెప్మా పిఓ రామారావు, సూపరిండెంట్లు పద్మనాభరావు, బాలాజీ బాష, మదన్ గోపాల్, మెప్మా సిఓలు, సిఎంఎంలు పాల్గొన్నారు.
Tags guntur
Check Also
థ్యాంక్యూ డిప్యూటీ సీఎం సార్
-సమస్య చెప్పుకొన్న నాలుగు వారాల్లోపే పరిష్కారం -క్యాంపు కార్యాలయానికి వచ్చి ధన్యవాదాలు తెలిపిన మెడికల్ హెల్త్ డిపార్ట్మెంట్ ఔట్ సోర్సింగ్ …