అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
తాడేపల్లి లిబరేషన్ కాంగ్రెస్స్ పార్టీ ఆఫీసులో పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు విజయ్ కుమార్ ఐ ఏ ఎస్ (R) విలేఖరుల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్లో కొత్త ప్రభుత్వ ఏర్పడి ఐదు నెలల పూర్తయింది ప్రభుత్వం కుదురుకోవడానికి కొంత సమయం ఇవ్వాలి కాబట్టి మా పార్టీ తరపున సమయం ఇచ్చామని ఐడియాలజీతో, విలువలు, సిద్ధాంతాలకు కట్టుబడి లిబరేషన్ కాంగ్రెస్స్ పార్టీ పనిచేస్తుందన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఓసి, మైనారిటీలోని పేదలను స్వపరిపాలన అధికార దిశగా నడిపించాలనే సిద్ధాంతంతో ముందుకి వెళ్తున్నామన్నారు. విమర్శలు ఏది పడితే ఆది కాకుండా నిర్మాణాత్మకమైన విమర్శలు మాత్రమే ఉంటాయన్నారు. మేము వ్యక్తిగతంగా విమర్శించము ఎవరైనా విమర్శించిన మేము స్పందించం. ప్రభుత్వం దాటవేత ధోరణిలో ఉందని, ఇచ్చిన హామీలు అమలు చేయకుండా కుంటి సాకులు చెబుతుందని అన్నారు. ఉపముఖ్యమంత్రి తన శాఖలు కు సంబంధించి పనులు చూడకుండా తిరుపతి లడ్డు, సనాతన ధర్మం గురించి మాట్లాడి ప్రజలను పక్కదారి పట్టిస్తున్నారని, మత సామరస్యం గల రాష్ట్రంలో మతాల మధ్య చిచ్చు పెడుతున్నారని, మీకోసం కష్టపడిన యువతకి మీ కమ్యూనిటీకి ఏదైనా మేలు చెయ్యండి అని జాతీ ఋణం తీర్చుకోవాలని, కాపు రిజర్వేషన్ ఇస్తామని 164 సీట్లుతో ప్రభుత్వం వచ్చి ఇన్ని నెలలు అయిన చర్యలు లేవన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News