Breaking News

ఎన్టీఆర్ జిల్లా వై.యస్.ఆర్.కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ సమన్వయకర్తలతో సమావేశం

విజ‌య‌వాడ, నేటి పత్రిక ప్రజావార్త :
వై.యస్.ఆర్.కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వై.యస్.జగన్మోహన్ రెడ్డి ఆదేశానుసారం రాష్ట్ర స్థాయి, జిల్లా స్థాయి నుండి గ్రామ స్థాయి వరుకు మరియు అనుబంధ విభా కమిటీలను నూతనంగా నియమంచాలని నిర్దేశించిన సందర్భంగా శనివారం నాడు ఎన్టీఆర్ జిల్లా. వై.యస్.ఆర్.కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్తల సమావేశం జరిగింది.ఈ సమావేశంలో కమిటీలు మరియు పార్టీ అభివృద్ధి గురించి దిశా నిర్దేశం చేయడం జరిగింది. అలాగే 3-నవంబర్-2024 తేదీన విజయవాడ, శేషాసాయి కళ్యాణ మండపంలో జరిగే ఎన్టీఆర్ జిల్లా వైసీపీ నాయకులు, కార్యకర్తలతో విస్తృతస్థాయి సమావేశం జయప్రదం చేయాలని జిల్లా అధ్యక్షులు దేవినేని అవినాష్ కోరారు. ఈ సమావేశంలో జిల్లా అధ్యక్షులు, తూర్పు నియోజకవర్గ ఇంచార్జ్ దేవినేని అవినాష్, పి.ఏ. సి మెంబెర్, వెస్ట్ ఇంచార్జ్ వేలంపల్లి శ్రీనివాసరావు, సెంట్రల్ ఇంచార్జ్ మల్లాది విష్ణు, ఎమ్మెల్సీ మొండితోక అరుణ్ కుమార్, తిరువూరు ఇంచార్జ్ స్వామి దాసు, జగ్గయ్యపేట ఇంచార్జ్ తన్నీరు నాగేశ్వరరావు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్లేస్ మీరు చెప్పినా… నన్ను చెప్పమన్నా.. …కూటమి అభివృద్ధిపై చర్చకు రెడీ

-వైసీపీకి మంత్రి సవిత సవాల్ -మీటరు రోడ్డు కూడా వేయలేని అసమర్థులు -వైసీపీ నేతలపై మంత్రి సవిత విసుర్లు -ఉన్న …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *