-డాక్టర్ లక్ష్మీ ప్రసన్న
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
హ్యాపీ కిడ్స్ క్లినిక్, భవానిపురం వైద్య నిపుణుల సంయుక్త ఆధ్వర్యంలో ఎన్డీఏ కార్యాలయంలో ఆదివారం నిర్వహించిన ఉచిత మెగా వైద్య శిబిరం విజయవంతమైందని పిల్లల వైద్య నిపుణులు డాక్టర్ వై .లక్ష్మీ ప్రసన్న( పీడియాట్రిక్స్) అన్నారు. హ్యాపీ కిడ్స్ క్లినిక్ ఆధ్వర్యంలో జరిగిన ఈ ఉచిత వైద్య శిబిరానికి స్థానిక మహిళలు, చిన్నారులు, వృద్ధులు భారీగా తరలివచ్చి నిపుణులైన వైద్యుల నుంచి చికిత్సను తీసుకొని సలహాలు, సూచనలు పొందారన్నారు. చిన్నపిల్లలకు సురక్షితమైన, నాణ్యమైన వైద్యాన్ని అందించడంలో హ్యాపీ కిడ్స్ క్లినిక్ ముందుంటుందని తెలియజేశారు.
డాక్టర్ లక్ష్మీప్రసన్న నేతృత్వంలో ప్రత్యేక అంశాల్లో నిపుణులైన వైద్యులు వినోద్ కుమార్ (ఆర్థోపెడిక్) కిరణ్ కుమార్ (డెంటల్) ఫణి కుమార్ (డయాబెటిక్) లత (గైనకాలజిస్ట్) వెనిగళ్ళ చంద్రశేఖర్ (లాప్రోస్కోపిక్) అనూష( ఫిజీషియన్ డయాబెటాలజిస్ట్) ఈ శిబిరంలో తమ సేవలను అందించారు. ఆదివారం ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం మూడు గంటల వరకు ఈ శిబిరాన్ని నిర్వహించారు. ఈ శిబిరంలో ఉచిత సేవలను అందించిన వైద్యులకు డాక్టర్ లక్ష్మీ ప్రసన్న ప్రత్యేక ధన్యవాదములు తెలిపారు.
టిడిపి అధికార ప్రతినిధి నాగుల్ మీరా ఈ వైద్య శిబిరాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మానవసేవే మాధవసేవగా భావించి సమాజ సేవలో భాగస్వామ్యులైన వైద్యులను అభినందించారు. ఎన్డీఏ నాలుగు నెలల పాలనలో ఏపీ అభివృద్ధి పథంలో పయనిస్తుందన్నారు.
కార్యక్రమంలో కూటమినేతలు మాజీ కార్పొరేటర్ యేదుపాటి రామయ్య, గుర్రంకొండ, నెలకుర్తి వెంకట్రావ్ , ప్రభు, బొల్లాపల్లి కోటేశ్వరరావు, పగడాల రామకృష్ణ, వేంపల్లి గౌరీ శంకర్ తదితరులు పాల్గొన్నారు.