Breaking News

28 అక్టోబర్ నుండి 30 అక్టోబర్ తారీకు వరకు విజయవాడ నగరంలో దీపావళి విత్ మై భారత్ కార్యక్రమాలు

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
కేంద్ర యువజన వ్యవహారాలు మరియు క్రీడా మంత్రిత్వ శాఖ మరియు కేంద్రం మై భారత్ డిపార్ట్మెంట్ ఆదేశాల మేరకు మైభారత్ పోర్టల్ లాంచ్ అవి సంవత్సరకాలం ముగుస్తున్నందున దీవాలి విత్ మై బారత్ అనే కార్యక్రమంలో చేపట్టడం జరుగుతుందని నెహ్రూ కేంద్ర జిల్లా యువ అధికారి ధికారి సుంకర రాము ఓ ప్రకటనలో తెలిపారు. దీవాలి విత్ మై బారత్ మేరా యువభారత్ ప్రోగ్రాం లో భాగంగా ఎన్టీఆర్ జిల్లా విజయవాడ నగరంలో ఈనెల 28 న కానురు కొత్త రైతు బజారు వద్ద స్వచ్ఛత కార్యక్రమం మరియు 29 వ తారిఖున పటమట రైతు బజార్ వద్ద స్వచ్ఛత కార్యక్రమం తొ పాటు అదే రొజు పాత గవర్నమెంట్ హాస్పిటల్ వద్ద వాలంటరి సర్విసు 30 వ తారిఖున మహాత్మా గాంధీ హొల్ సేల్ మార్కేట్ వద్ధ స్వచ్ఛభారత్ అలానే గొల్లపూడి ట్రాఫిక్ సిగ్నల్ వద్ద ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నామని దీనికి స్థానిక యువత ఎన్జీవోస్ ఈ కార్యక్రమాలకు పెద్ద ఎత్తున హాజరుకావాలని నెహ్రూ యువ కేంద్ర యువ అధికారి సుంకర రాము తెలిపారు. మరిన్ని వివరాలకు లక్ష్మీపతి నగర్ ఆటోనగర్ కార్యాలయం నందు గాని లేదా dyc.vijayawada@gmail.com 9966357021 సంప్రదించాలని కోరారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్లేస్ మీరు చెప్పినా… నన్ను చెప్పమన్నా.. …కూటమి అభివృద్ధిపై చర్చకు రెడీ

-వైసీపీకి మంత్రి సవిత సవాల్ -మీటరు రోడ్డు కూడా వేయలేని అసమర్థులు -వైసీపీ నేతలపై మంత్రి సవిత విసుర్లు -ఉన్న …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *