విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు రాష్ట్రీయ ఏకతా దివస్ సందర్భంగా, దేశసేవలో తెగువ చూపి ఉక్కుమనిషిగా పేరు గాంచిన సర్దార్ వల్లభ భాయ్ పటేల్ జయంతి వేడుకను ఈ రోజు ఏపిఎస్ ఆర్టీసీ ప్రధాన కార్యాలయం ఆర్టీసీ హవుస్ నందు ఘనంగా నిర్వహించారు. సర్దార్ వల్లభ భాయ్ పటేల్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. భారతదేశ స్వాతంత్ర్యసమరంలోను స్వాతంత్ర్యానంతరం దేశసేవలో అడుగడుగునా ఆయన చూపిన తెగువ సాహసోపేతమైన నిర్ణయాలను ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు.
ఈ వేడుకలకు విచ్చేసిన ఆహూతులకు ఆహ్వానం పలుకుతూ ప్రధాన కార్యాలయం డిప్యూటీ చీఫ్ పర్సనల్ మేనజర్ (హెచ్ ఆర్ డి & డబ్ల్యూ) కుమారి సాంబ్రాజ్యం, ఉక్కుమనిషి వల్లభ భాయ్ పటేల్ గురించిన పరిచయ ప్రసంగం చేసి భారత దేశ ఐక్యత కొరకు ఆయన చేసిన ఎనలేని అమూల్యమైన సేవల విశిష్టతను వివరించారు. ఈ దేశానికి స్వాతంత్ర్యం సాధించడంలోనూ, స్వాతంత్ర్య భారతావని మొదటి ఉప ప్రధానిగా, హోమ్ శాఖా మంత్రిగా వివిధ పరీక్షా సమయాలలో ఆయన దృఢ సంకల్పం, పట్టుదలతో వ్యవహరిస్తూ దేశసేవలో తెగువ చూపిన కారణంగానే ఉక్కుమనిషిగా పేరుగాంచారని తెలిపారు. ఆయన తీసుకున్న సాహసోపేత నిర్ణయాలు దేశ ఐక్యతను సుస్థిరంగా కాపాడేందుకు ఈనాటికీ దోహదం చేస్తున్నాయన్నారు. దేశ సమైక్యతను కాపాడడంలో తన సర్వస్వం ఒడ్డిన దేశభక్తునిగా ఆ మహానుభావుడి నుండి మనం నేర్చుకోదగిన విషయాలను తెలియచెప్పారు. స్వాతంత్ర్య సమరయోధునిగా, స్వాతంత్ర్యం అనంతరం ఉప ప్రధానిగా, హోమ్ శాఖ మంత్రిగా రాజ్యాంగ సభ సభ్యునిగా ఆయన చేసిన సేవలకు గుర్తింపుగా భారత ప్రభుత్వం భారత రత్న బిరుదు తో గౌరవించిందన్నారు.
రాష్ట్రీయ ఏకతా దివస్ సందర్భంగా వేడుకలకు విచ్చేసిన వారితో దేశ ఐక్యతా ప్రతిజ్ఞ చేయించారు. ఈ వేడుకలకు సంస్థ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ (అడ్మినిస్ట్రేషన్) రవివర్మ ముఖ్య అతిధిగా హాజరు కాగా, సి. పి.ఎం. స్వరూపానంద రెడ్డి, డిప్యూటీ సిపిఏం (హెచ్.ఆర్.డి అండ్ వెల్ఫేర్) కుమారి డి. సాంబ్రాజ్యం, ఏ.డి (విజిలెన్స్ అండ్ సెక్యూరిటీ) శోభామంజరి ఇంకా తదితర ఉన్నతాధికారులు, అధికారులు, సూపర్వైజర్లు, వివిధ అసోసియేషన్ల ప్రతినిధులు, ఉద్యోగులు పలువురు హాజరయ్యారు. ఈ వేడుకలు సంస్థ హెచ్. ఆర్. డి అండ్ వెల్ఫేర్ విభాగం ఆధ్వర్యంలో నిర్వహించబడ్డాయి.
Tags vijayawada
Check Also
థ్యాంక్యూ డిప్యూటీ సీఎం సార్
-సమస్య చెప్పుకొన్న నాలుగు వారాల్లోపే పరిష్కారం -క్యాంపు కార్యాలయానికి వచ్చి ధన్యవాదాలు తెలిపిన మెడికల్ హెల్త్ డిపార్ట్మెంట్ ఔట్ సోర్సింగ్ …