విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ప్రజలకు రక్షణగా ఉండాల్సిన పోలీసులే, రిమాండ్ ఖైదీకు తొత్తులుగా మారితే ఎలా..?ప్రజలకు పని చేస్తున్నారా వైసీపీ గుండాలకు సేవ చేస్తున్నారా..?? ఇంకా పద్ధతి మార్చుకోకపోతే ఎలా..? అంటూ టిడిపి కార్యకర్త నితిన్ వరికూటి ప్రశ్నించారు. రిమాండ్ ఖైదీ బోరుగడ్డ అనిల్ ను రాజమండ్రి కి తరలించే సమయంలో గన్నవరం వద్ద పోలీసులు నిర్లక్ష్యాన్ని, అలసత్వాన్ని సెల్ పోన్ లో చిత్రీకరించిన టిడిపి కార్యకర్త నితిన్ వరకోటి వైసిపి నాయకులకి అనుకూలంగా వున్న పోలీసుల తీరును ఖండిస్తూ గురునానక్ కాలనీలోని విజయవాడ పార్లమెంట్ కార్యాలయం,ఎన్టీఆర్ భవన్ లో గురువారం మీడియా సమావేశం నిర్వహించారు.
ఈ సందర్బంగా నితిన్ వరికూటి మాట్లాడుతూ గత వైసీపీ ప్రభుత్వ అధికారాన్ని అడ్డం పెట్టుకొని సజ్జల కనుసన్నల్లో ఎన్నో అరాచకాలకు అకృత్యాలకు బరితెగించిన నీచుడు బోరుగడ్డ అనిల్ ఎంతటి దుర్మార్గుడో ప్రజలందరికీ తెలుసునన్నారు. నిబంధనల ప్రకారం ఖైదీని వాహనంలోనే ఉంచి ఆహారం అందించాలి, అయితే వైసీపీ కి తొత్తులుగా పనిచేస్తోన్న కొంతమంది పోలీసులు గన్నవరం ఎయిర్ పోర్ట్ వద్ద ఒక హోటల్ లో బోరుగడ్డ అనిల్ కు రాజా మర్యాదలు చేశారని… చికెన్ , మటన్ లతో భోజనం తినే విధంగా వెసులుబాటు కల్పించటమే కాకుండా మాట్లాడేందుకు పోన్ కూడా ఇచ్చారని తెలిపారు. తాను ఈ దృశ్యాలను సెల్ పోన్ లో రికార్డ్ చేయటానికి ప్రయత్నించే లోపు…ఈ విషయం గమనించిన బోరుగడ్డ అనిల్ సిఐని పంపించి బెదిరించాడన్నారు. తన ఫోన్ లాక్కొని ఫోన్లో ఏమి లేకపోయినా ఫోటోలను వీడియోను డిలీట్ చేయటానికి బెదిరించి పోన్ లాక్కుడని తెలిపారు.
ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న సీఎం చంద్రబాబు ని, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ని, వారి కుటుంబీకులను, ఆడబిడ్డలను త్రీవ్రమైన అసభ్య పదజాలంతో దూషించిన దుర్మార్గుడు రిమాండ్ ఖైదీగా ఉన్న బోరుగడ్డ అనిల్ ను ఎస్కార్ట్ లో తీసుకొచ్చి విలాసవంతమైన రెస్టారెంట్ లో విందు భోజనం ఎందుకు పెట్టిస్తున్నారని పోలీసులని ప్రశ్నించినట్లు తెలిపారు. వెంటనే వాళ్లు అక్కడ నుంచి వెళ్లిపోయారన్నారు.
ఇప్పటికి కొంతమంది పోలీసులు వైసిపి నాయకులు చెప్పినట్లు పనిచేస్తున్నారు. వారంతా గమనించాల్సిన విషయం ఏమిటంటే గత జగన్ ప్రభుత్వా అరాచకాన్ని ప్రజలు భరించలేక, సీఎం చంద్రబాబు పై నమ్మకంతో ప్రజలు పెద్ద ఎత్తున మద్దతు పలికి కూటమి ప్రభుత్వాన్ని స్థాపించారని అన్నారు. పోలీసులు వ్యవహరించిన తీరుపై సర్వత్రా విమర్శలు వస్తున్నాయన్నారు. ప్రజలు తిరగబడి ప్రశ్నించక ముందే వైసిపి నాయకులకి తొత్తులుగా వ్యవహరించే కొందరు పోలీసులు తీరు మార్చుకోవాలని హితువు పలికారు.