Breaking News

ఎంపి కేశినేని శివనాథ్ తో ఇన్చార్జ్ మంత్రి స‌త్య‌ప్ర‌సాద్ యాద‌వ్ భేటీ

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ఎన్టీఆర్ జిల్లా ఇన్‌చార్జి మంత్రి, ఆరోగ్య‌ శాఖ మంత్రి వై. సత్య కుమార్ యాదవ్ గురునాన‌క్ కాల‌నీలో విజ‌య‌వాడ ఎంపి కేశినేని శివ‌నాథ్ ను మ‌ర్యాద పూర్వ‌కంగా గురువారం ఆయ‌న నివాసంలో బేటీ అయ్యారు. మంత్రి వై. సత్య కుమార్ యాదవ్ కు ఎంపి కేశినేని శివ‌నాథ్, టిడిపి జాతీయ అధికార ప్ర‌తినిధి కొమ్మారెడ్డి ప‌ట్టాభిరామ్ తో క‌లిసి సాద‌ర స్వాగ‌తం ప‌లికారు. అనంత‌రం ఎంపి కేశినేని శివ‌నాథ్ మంత్రి వై. సత్య కుమార్ యాదవ్ ను శాలువా స‌త్క‌రించి శ్రీ వెంక‌టేశ్వ‌ర‌స్వామి ప్ర‌తిమ‌ను బ‌హుక‌రించారు. ఆ త‌ర్వాత ఎన్టీఆర్ జిల్లా, రాష్ట్ర రాజ‌కీయ ప‌రిస్థితులతో పాటు ప‌లు అంశాలు చ‌ర్చించుకున్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : కర్ణాటక నుండి రాయలసీమ, తమిళనాడు మీదుగా మన్నార్ గల్ఫ్ వరకు ద్రోణి విస్తరించి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *