విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
పశ్చిమ నియోజకవర్గ పరిధిలోని పలు అభివృద్ధి పనులపై ఎమ్మెల్యే యలమంచిలి సత్యనారాయణ
(సుజనా చౌదరి) తాడిగడప లోని తమ కార్యాలయంలో గురువారం సమీక్ష నిర్వహించారు. రెవెన్యూ, ఇంజనీరింగ్ పట్టణ ప్రణాళిక, తాగునీటి సరఫరా, ఆరోగ్యశాఖ ఆయా విభాగాల సంబంధిత అధికారులతో చర్చించారు. పశ్చిమ లోని ప్రధాన రహదారులు, అంతర్గత రహదారులు, డ్రైనేజీలు, పార్కులు, రహదారుల విస్తరణ, కొండ ప్రాంతాలలో చేయవలసిన అభివృద్ధి, సంక్షేమం పై సమీక్షించి తగు ఆదేశాలు జారీ చేశారు. రెవెన్యూ అధికారులతో పన్నుల వసూలు మరియు ఇంటింటి సర్వే ద్వారా పూర్తి చేయవలసిన పనులు గురించి చర్చించారు. తాగునీటి సరఫరా, డ్రైనేజీల నిర్వహణ, పారిశుధ్యం పై ప్రత్యేక దృష్టి పెట్టి ప్రతిరోజు రహదారులు, మురుగు కాలువలను శుభ్రంగా ఉంచాలని ఆయా విభాగాల అధికారులతో ఎమ్మెల్యే సుజనా చౌదరి సమీక్షించారు. కార్యక్రమంలో మెడికల్ ఆఫీసర్ సురేష్, సిటీ ప్లానర్ ప్రసాద్, జోనల్ కమిషనర్ రమ్య కీర్తన, అసిస్టెంట్ కమిషనర్ హెలెన్ , ఈయి వెంకటేశ్వర రెడ్డి సంబంధిత అధికారులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News