-చింతలపూడి లిఫ్టు ఇరిగేషన్ పై కలెక్టర్ పి ప్రశాంతి సమీక్ష
రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
చింతలపూడి ఎత్తిపోతల పథకం కింద కోర్టు కేసులు, ఇతర అంశాలపై ఇరిగేషన్, రెవిన్యూ అధికారులతో సమావేశం నిర్వహించడం జరిగిందని జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి తెలియ చేశారు. శుక్రవారం ఉదయం కలెక్టరు ఛాంబర్ లో ఇరిగేషన్, చింతలపూడి ఎల్ ఐ, పి ఐ పి, రెవిన్యూ అధికారులతో చింతలపూడి ఎత్తిపోతల పథకం భూ సంబంధ అంశాలపై సమీక్షించడం జరిగింది. ఈ సందర్భంగా కలెక్టర్ పి ప్రశాంతి అధికారులకి సూచనలు జారీ చేస్తూ, చింతలపూడి ఎత్తిపోతల పథకం కింద ఉన్న భూములకు సాగు నీరు అందించడంలో ప్రభుత్వ, ప్రభుత్వేతర భూముల భూసేకరణ చెయ్యడం జరిగిందని తెలిపారు. వాటికీ సంబంధించి యధార్థ స్థితి గతులు పై ఇరిగేషన్, రెవెన్యు అధికారులు సమగ్ర నివేదిక రూపొందించాలని ఆదేశించారు. గతంలో భూములు ఇచ్చిన రైతులకి కోర్టు ఆదేశాలను అనుసరించి తగిన విధంగా చర్యలు తీసుకోవడం జరుగుతుందని పేర్కొన్నారు. ఈ సమావేశంలో పులిచింతల ప్రాజెక్టు సూపరింటెండెంట్ ఇంజనీర్, చింతలపూడి ఎత్తిపోతల పథకం ఇన్చార్జి ఆర్. శ్రీరామకృష్ణ , స్పెషల్ డిప్యూటి కలెక్టరు, (పి ఐ పి) ఆర్ వి రమణ నాయక్, కలక్టరేట్ ఎవో ఎండి ఆలీ, గోపాలపురం, తాళ్లపూడి తహసీల్దార్లు సిహెచ్. విద్యా పతి, బి. రవీంద్రనాథ్ తదితరులు పాల్గొన్నారు.