Breaking News

అఖిల భారతీయ కోలి/ముదిరాజ్ సమాజ్ ఎన్నికల్లో పాల్గొననున్న వి.గురునాధం

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ఈ నెల 10వ తేదీన జరగనున్న అఖిల భారతీయ కోలి/ముదిరాజ్ సమాజ్ ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ కోలి/ముదిరాజ్ సమాజ్ రాష్ట్ర అధ్యక్షుడు వి.గురునాధం పాల్గొననున్నారు. దేశంలో సుమారు 15 కోట్ల మంది కోలి/ముదిరాజ్/ ముత్తారయ్యర్ కులానికి సంబంధించిన వారు ఉన్నారని అఖిల భారతీయ కోలి/ముదిరాజ్ సమాజ్ కేంద్ర కార్యాలయం దేశ రాజధాని ఢిల్లీలో గలదని ఈ సంఘానికి గతంలో ఈ దేశానికి రాష్ట్రపతిగా చేసిన రామనాధ్ కోవింధ్ కోవింద్ గారు చాలా కాలం జాతీయ అధ్యక్షునిగా వ్యవహరించారని.. అదే విధంగా కొంతకాలం ఉజ్జయిని నుంచి పార్లమెంట్ సభ్యునిగా ఉన్న సత్యనారాయణ పవర్ అధ్యక్షులుగా పనిచేశారని.. ఈనెల 10వ తారీఖున తిరిగి ఈ సంఘానికి సంబంధించి ఎన్నికలు జరుపుటకు అఖిల భారత కోలి/ముదిరాజ్ సమాజ్ సంఘం నిర్ణయించిందని ఈ ఎన్నికల్లో సిమ్లా నుంచి మాజీ బిజెపి పార్లమెంట్ సభ్యులు వీరేంద్ర కాశ్యప్, కాంగ్రెస్ పార్టీకి చెందిన ఉజ్జయిని మాజీ ఎంపీ సత్యనారాయణ పవర్ మధ్య పోటీ జరగనుందని.. సదరు ఎన్నికల సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి కోలి/ముదిరాజ్ సమాజ్ సంఘం అధ్యక్షులు అయిన వి.గురునాధం ని ఈ నెల 10.11.2024 తేదీన జరగనున్న ఎన్నికల్లో పాల్గొనవలసిందిగా జాతీయ కమిటీ కోరినందున ది.09.11.2024న ఢిల్లీకి వెళ్ళనున్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

విశాఖ రైల్వేజోన్‌ ఏర్పాటు చేస్తూ గెజిట్‌ విడుదలపై సీఎం చంద్రబాబు హర్షం

-రాష్ట్ర ప్రజల చిరకాల స్వప్నం నెరవేరిందని ముఖ్యమంత్రి వ్యాఖ్య అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : విశాఖ కేంద్రంగా దక్షిణ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *